
టీచర్స్ డే 2022: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన విద్యార్థులంతా టీచర్స్ డేను జరుపుకుంటారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ భారతదేశపు మొదటి ఉప రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసి ఎన్నో సేవలనందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న జన్మించారు. ఈయన గొప్ప తత్వవేత్తగా, ఉపాధ్యాయుడిగా, పండితుడిగా ఎన్నో సేవలందించాడు.
డాక్టర్ రాధాకృష్ణన్ విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చే దిశగా యువతను ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప ఉపాధ్యాయులను గౌరవించాలనే ఉద్దేశ్యంతో తన జయంతిని 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకోవాలని నిశ్చయించారు. దాంతో 1962 నుంచి సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..
టీచర్స్ డే ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఎందుకంటే విద్యార్థులు తమ గురువులను గౌరవించే రోజు ఇది. ఇంతటి గొప్ప రోజును ప్రతి పాఠశాల, సంస్థ జరుపుకుంటుంది. ఇక విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు, పాఠాలను గౌరవించేందుకు కవితలు, స్కిట్లు, ఉపన్యాసాలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలతో సహా వివిధ పాఠ్యేతర కార్యకలాపాలను ప్లాన్ చేస్తారు. ఈ టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పదండి..