టీచర్స్ డే 2022: టీచర్స్ డే ను సెప్టెంబర్ 5 నాడే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Sep 1, 2022, 2:42 PM IST
Highlights

టీచర్స్ డే 2022:  ఈ సమాజానికి ఉపాధ్యాయులు చేసే సేవ వెలకట్టలేనిది.. వారి సేవలను గౌరవించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ నాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం.. 

టీచర్స్ డే 2022:   కనిపెంచిన తల్లిదండ్రుల రుణమైనా తీర్చుకోవచ్చు కానీ.. విద్యా బుద్ధులు నేర్పిన గురువుల రుణం మాత్రం ఏం చేసినా తీర్చుకోలేమంటారు పెద్దలు. ఎందుకంటే గురువు అంత గొప్పవాడు కాబట్టి. ‘గు’ అనే అక్షరం చీకటిని సూచిస్తుంటే..‘రు’అనే అక్షరం వెలుగును సూచిస్తుంది. అంటే విద్యార్థుల్లో ఉండే చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రసాధించే వాడే గురువు అని అర్థం. ఇలాంటి గొప్ప  వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవ ఎన్నో తరాలకు ఆదర్శం. అందుకే ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. 

సెప్టెంబర్ 5వ తేదీనాడే ఒక గొప్ప ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఈయనకు విద్యంటే చాలా ఇష్టం. ఈయన సుప్రసిద్ధ దౌత్యవేత్తగా, పండితుడిగా, భారత రాష్ట్రపతిగా అన్నింటికీ మించి ఒక ఉపాధ్యాయుడగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

అయితే ఈయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడానికి  విద్యార్థులు, స్నేహితులు కొందరు సర్వేపల్లి రాధాకృష్ణన్ ను సంప్రదిస్తారు. అప్పుడు రాధాకృష్ణన్ ఇలా అన్నారట.. "నా పుట్టినరోజును విడిగా జరుపుకోవడానికి బదులుగా.. సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను సంతోషిస్తాను" అని. ఇక అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు.

1965వ స౦వత్సర౦లో డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు చె౦దిన కొ౦తమ౦ది విద్యార్థులు.. ఆ గొప్ప గురువుకు గౌరవించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సభలో డాక్టర్ రాధాకృష్ణన్ తన ప్రసంగంలో తన జన్మదిన వేడుకల గురించి ఒక విషయాన్ని తెలిపారు. భారతదేశంలో ఉండే ఇతర గొప్ప గొప్ప ఉపాధ్యాయులకు నివాళులు అర్పించడం ద్వారా తన జయంతిని 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకోవాలని కోరారట.  దాంతో 1967 సంవత్సరం నుంచి సెప్టెంబర్ 5వ తేదీని నేటి వరకు ఉపాధ్యాయ దినోత్సవంగానే జరుపుకుంటున్నారు.

డాక్టర్ రాధాకృష్ణన్ గురించి మనం చెప్పుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. ఇతను మన దేశానికి ఎన్నోహోదాల్లో ఉండి సేవలందించాడు. అన్నింటికీ మించి ఇతను ఓ గొప్ప గురువు . ఇతని నుంచి మనమందరం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ ఒక గొప్ప తత్వవేత్త, గొప్ప విద్యావేత్తగ, గొప్ప మానవతావాది కూడా. ఈయన రాష్ట్రపతిగా ఉంటూ భారతదేశానికి ఎంతో సేవ చేశారు.  ఇక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజున భారతదేశం అంతటా విద్యార్థులు.. తమ ఉపాధ్యాయులను గౌరవించి వారి గురించి ఉపన్యాసాలు చెబుతారు. 
 

click me!