Ambali Health Benefits: సమ్మర్ లో అంబలి తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయో..

Published : Mar 30, 2022, 03:08 PM ISTUpdated : Mar 30, 2022, 07:36 PM IST
Ambali Health Benefits: సమ్మర్ లో అంబలి తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయో..

సారాంశం

Ambali recipe: ఎండాకాలంలో అంబలిని తాగడం వల్ల ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. వెయిట్ లాస్ కూడా అవుతారు.  

Ambali Health Benefits: ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు అన్నం తక్కువ .. అంబలిని ఎక్కువగా తీసుకునేవారు. రాగులు, జొన్నలు, కొర్రలతో అంబలిని తయారు చేసుకుని తాగేటోళ్లు. కానీ ఇప్పుడు అంబలి అంటే కూడా తెలియని వారు చాలా మందే ఉన్నారు. 

వేసవి కాలం అంబలి మన ఒంటికి దివ్య ఔషదంలా పనికొస్తుంది తెలుసా.. వీటిలో ఎన్నో పోషకవిలువలుంటాయి. మరీ ముఖ్యంగా రాగులతో చేసిన అంబలిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

ఈ సీజన్ లో అంబలిలో కాస్త మజ్జికను మిక్స్ చేసి తాగితే ఎండ వల్ల మీ ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది కూడా. 

ఇక అధిక బరువుతో బాధపడేవారు కాలాలతో సంబంధం లేకుండా నిత్యం అంబలిని తాగితే ఎన్నో కేలరీలు ఖర్చైపోతాయి. ముఖ్యంగా అంబలి తాగితే తొందరగా ఆకలి అవదు. కాబట్టి బరువు తగ్గేందుకు అంబలి చక్కటి మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ అంబలిని రెగ్యులర్ గా తాగడం వల్ల అలసట రాదు. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. 

మధుమేహం, స్థూలకాయం, బీపీ పేషెంట్లకు ఇది చక్కటి మెడిసిన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది వీరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

రాగి అంబలిని తాగడం వల్ల శుక్రకణాల సంఖ్య  పెరుగుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అలాగే శరీరం కూడా బలంగా తయారవుతుంది. ఉత్సాహంగా కూడా ఉంటారు.

ఈ ఎండాకాలం వేడిచేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ దీన్ని తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పిల్లలకు రాగి అంబలిని తాగించడం వల్ల వారు చురుగ్గా ఉంటారు. వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుందట. చదువులో కూడా ఫాస్ట్ అవుతారట. 

బ్రేక్ ఫాస్ట్ లో అంబలిని తాగితే.. ఆ రోజంతా ఎంతో హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు. శరీరం మంచి ఫిట్ గా కూడా ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు
బంగారానికి పోటీ ఇచ్చేలా మెరిసే వెండి ఉంగరాలు