
ఒకప్పుడు 60 నుంచి 80 ఏండ్ల వారికే గుండె పోటు ముప్పు ఉండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే లేవు. 35 దాటితే చాలు ఏ క్షణాన గుండె పోటు వస్తుందో నంటూ ఆందోళన చెందుతున్నారు. కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి మేకపాటి గౌతమ్ రెడ్డిలది చిన్న వయసే. అయినా వారు హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు విడిచారు. మంచి ఆరోగ్యం, ఫిట్ నెస్ కలిగి ఉన్న వారే ఈ గుండెపోటు బారిన పడితే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్నదే ఆందోళన కలిగించే విషయం.
గుండె పోటును లక్షణాలను గుర్తిస్తే వారిని తొందరగా హాస్పటల్లకు తరలించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు. మరణాలను కూడా నివారించవచ్చు. మరి ఈ గుండెపోటును ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా ఏండ్ల కిందట 35 ఏండ్లకే గుండె పోటు వచ్చే ముప్పు చాలా తక్కువ. వాస్తవానికి గుండె ధమనులకు సంబంధించిన రోగమే కరొనరీ ఆర్టరీ డిసీజ్. గుండెకు ఆక్సిజన్ , రక్తాన్ని ధమనులే Supply చేస్తాయి. ఒకవేళ గుండెజబ్బు సోకితే మాత్రం ఈ ధమనులు సన్నబడుతాయి.
కొన్ని కొన్ని సార్లైతే అవి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. తద్వారా గుండకు బ్లడ్ సప్లై తగ్గిపోవడమో లేకపోతే పూర్తిగా ఆగిపోవడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో Chest లో pain రావడం మొదలవుతుంది. దీన్నే వైద్య భాషలో యాంజైనా లేదా యాంజినా పెక్టోరిస్ అంటుంటారు.
హార్ట్ కు రక్తం సప్లై కాకపోతే గుండె Heart muscles చచ్చుబడిపోతుంటాయి. దీన్నే గుండె పోటు (Heart Attack) అంటారు. ఈ మధ్యకాలంలో మన దేశంలో 35 నుంచి 40 ఏండ్లున్న వారు కూడా Coronary artery disease బారిన పడుతున్నారు.
లక్షణాలు: చిన్న వయసు వారిలోనైనా, పెద్ద వారిలోనైనా హార్ట్ ఎటాక్ లక్షణాలు ఒకే విధంగానే ఉంటాయి. ఇందలో ముఖ్యమైన లక్షణం ఛాతిలో నొప్పి. ఛాతిని నొక్కి పట్టుకున్నట్టుగా, ఏదో పెద్ద బరువు మోపినట్టుగా, అది అటూ ఇటూ పాకుతున్నట్టుగా అయ్యి విపరీతమైన మంట పుడుతుంది. ఇలా అనిపించినప్పుడు చాలా మంది అది గ్యాస్ అంటూ తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది గుండె జబ్బుకు సంకేతమని గుర్తించాలి.
త్వరగా గుర్తించడమెలా: చెస్ట్ లో నొప్పి ఏర్పడినప్పుడు ఎడమ భుజం, మెడ, మీపులోకి పాకుతున్నట్టుగా అనిపిస్తుంది.
ఛాతిలో పుట్టిన నొప్పి అటు ఇటూ కదులుతున్నట్టుగా ఉండే అది ఐదే ఐదు నిమిషాల్లో తీవ్రస్థాయిలోకి పెరుగుతుంటే అది గుండె నొప్పిగానే భావించాలి.
ఛాతిలో నొప్పితో పాటుగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలకడం, విపరీతంగా చెమటలు పట్టడం, వికారంగా అనిపించడం వంటివి కూడా హార్ట్ ఎటాక్ కు ముందు వచ్చే లక్షణాలే.
జాగ్రత్తలు: పెద్ద వయసైనా, చిన్నవయసైనా గుండె పోటు లక్షణాలను ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్న వయసు వారి వీటిని గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎసిడిటీ, గ్యాస్, అజీర్థి వంటి సమస్యల లక్షణాలు గుండెపోటు లక్షణాల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి వీరు రిస్క్ తీసుకోకుకండా గుండె జబ్బుల టెస్ట్ లను తప్పని సరిగా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఊబకాయం బారిన పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం తప్పనిసరి.
ఊబకాయులే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి వీరు శరీర బరువును తగ్గించుకోవడం ఎంతో అవసరం. కొవ్వు పదార్థాలను అస్సలు తినకూడదు. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. శారీరక శ్రమ ఎంతో ముఖ్యం.