పాల దంతాలతో ప్రాణాలు కాపాడొచ్చా..?

By ramya neerukondaFirst Published Jan 2, 2019, 2:35 PM IST
Highlights

 తొలిసారి వచ్చిన దంతాలను పాల దంతాలు అని అంటారు ఇది మనకు తెలిసిందే. ఈ పాల దంతాలతో ప్రాణాలే కాపాడొచ్చు అంటున్నారు నిపుణులు.
 

పుట్టిన ప్రతి ఒక్కరికీ.. సంవత్సరంలోపు దంతాలు వస్తాయి. అవి కొన్ని సంవత్సరాలకు ఊడిపోయి.. వాటి స్థానంలో మళ్లీ దంతాలు వస్తాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే.. తొలిసారి వచ్చిన దంతాలను పాల దంతాలు అని అంటారు ఇది మనకు తెలిసిందే. ఈ పాల దంతాలతో ప్రాణాలే కాపాడొచ్చు అంటున్నారు నిపుణులు.

మీరు చదివింది నిజమే.. చిన్నప్పుడు ఊడిపోయిన పాల దంతాలను భద్రపరిస్తే.. వాటితో భవిష్యత్తులో ఏదైనా జబ్బు వస్తే.. వాటి ద్వారా రక్షించవచ్చట. స్టెమ్ సెల్స్ గురించి మీరు వినే ఉంటారు. తల్లి కడుపుతో ఉన్నప్పుడు.. డెలివరీ సమయంలో స్టెమ్ సెల్స్ తీసి వాటిని భద్ర పరుస్తారు. ఆ స్టెమ్ సెల్స్ ద్వారా భవిష్యత్తులో ఏదైనా ప్రాణాంతక వ్యాధి వస్తే.. ఆ జబ్బుని నయం చేస్తారు.

అచ్చం అలాంటి స్టెమ్ సెల్స్.. పాలదంతాలలో కూడా ఉంటాయట. శరీరంలో దెబ్బతిన్న కణాలను భర్తీ చేయడం ఎంతో ముఖ్యం. స్టెమ్‌సెల్స్‌ వివిధ రకాల కణాలుగా రూపాంతరం చెందుతాయి. పాల దంతాల్లోని స్టెమ్‌సెల్స్‌ను ఉపయోగించి, కొత్త కణాలను ఉత్పత్తి చేయొచ్చు. ఇవి భవిష్యత్తులో ఎదురయ్యే, ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. క్యాన్సర్‌ వ్యాఽధి నుంచి బయటపడేందుకు కూడా స్టెమ్‌సెల్స్‌ ఉపయోగపడతాయని అంటున్నారు పరిశోధకులు.

click me!