చలికాలంలో గొంతునొప్పి.. తగ్గించే చిట్కాలివే

By ramya neerukondaFirst Published Dec 24, 2018, 3:55 PM IST
Highlights

చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు, తుమ్ములు, దగ్గు రావడం సహజం. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కనీసం మూడు, నాలుగు రోజులు వేధిస్తూనే ఉంటాయి. 

చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు, తుమ్ములు, దగ్గు రావడం సహజం. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కనీసం మూడు, నాలుగు రోజులు వేధిస్తూనే ఉంటాయి. ఇక జలుబు ఉందంటే గొంతు నొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గొంతు సమస్య తగ్గించుకోవడానికి చిన్నపాటి ఇంటి చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ఉప్పుని గోరువెచ్చని నీటిలో వేసి.. కరిగిన తర్వాత  ఆ నీటితో నోరు పుక్కిలించాలి. రోజుకి నాలుగైదు సార్లు ఇలా చేస్తే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.అల్లంతో చేసిన టీ తాగడం, లేదా వేడి నీటిలో అల్లాణి వేసి ఆ నీటిని తాగడం వలన కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.

కొద్దిగా వేడి చేసిన నీటిలో నిమ్మరసం, తేనే కలుపుకొని తాగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రోజు ఉదయం పాలల్లో మిరియాలు కలుపుకొని తాగడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. దాల్చిన చెక్క, తేనే కలుపుకొని తాగిన మంచి ఫలితం ఉంటుంది.

click me!