రాముడి నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవి..!

By Mahesh RajamoniFirst Published Mar 26, 2023, 3:39 PM IST
Highlights

srirama navami 2023: మహావిష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు. జీవితంలోని ఏ పాఠమైనా నేర్చుకోవడానికి ఆయనే మనకు ఆదర్శం. ఈయన జీవిత కథ విద్యార్థులకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది తెలుసా..!
 

srirama navami 2023: రామాయణం మనకు ఎంతో ఆదర్శం. గ్రంథం మనకు ఎన్నో విషయాలను భోదిస్తుంది. ఎన్ని బాధలు ఎదురైనా.. రాముని జీవిత కథలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు ఉన్నాయి. రాముడి వ్యక్తిత్వం ఎంత నైతికమైనదంటే.. అందుకే ఆయన్ను ఆదర్శ పురుషోత్తముడు అంటారు. పెద్దలే కాదు పిల్లలు కూడా రాముడి కథను తెలుసుకోవాలి. ఎందుకంటే రాముడి జీవితం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. రాముడి నుంచి విద్యార్థులు ఎలాంటివి నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

లక్ష్యాల పట్ల అంకిత భావం

రావణాసుడు సీతాదేవీని అపహరిస్తాడు. లంకలో ఉన్న సీతాదేవీని చేరుకోవడానికి మార్గం లేదు. అసలు అది ఎక్కుడుందో తెలియదు. అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా తెలియదు. ఎంత సమయం పడుతుంది.. రోజులా, గంటలా, లేక సంవత్సరాలా అన్న సంగతులేమీ రాముడికి తెలియవు. ఏదేమైనా లంకకు చేరుకుని సీతాదేవిని తీసుకురావాలని ఒక లక్ష్యం మాత్రం పెట్టుకున్నాడు. దాన్ని సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆకరికి లంకను చేరుకుని రావణుడితో పోరాడి సీతను తిరిగి తన దగ్గరికి తీసుకొచ్చాడు. ఏదేమైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనక్కి తగ్గకుండా ఉండటం రాముడిని చూసి విద్యార్థులు నేర్చుకోవాలి. రాముడికి సీత ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. అయినా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అంతేకాదు ఇక నావల్ల కాదు అని లక్ష్యాన్ని వదులుకోలేదు. లక్ష్యాల పట్ల ఆ మహానుభావుడికి ఉన్న అంకితభావం అందరకీ ఆదర్శనీయం.

వినయమే ఉత్తమ విధానం

రాముడు ఎంతో నైపుణ్యం కలిగిన విలు విద్యకారుడు. ఆయుధాలు, శాస్త్రాల గురించి ఆయనకు పూర్తి పరిజ్ఞానం ఉంది. కానీ ఆ శక్తి, జ్ఞానమంతా ఆయనలో గోరంత కూడా అహంకారాన్ని తీసుకురాలేదు, వినయానికి ప్రతిరూపం శ్రీరాముడు. రామునిలోని వినయాన్ని అలవర్చుకోవాలి.

ప్రశాంతంగా ఉండటం

రాముడు ఎన్నో యుద్ధాలు చేశాడు. పౌరాణిక రాక్షసులతో పోరాడాడు. ఎన్నో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కానీ ఏనాడూ సంయమనం మాత్రం కోల్పోలేదు. ఏ మాత్రం క్రుంగిపోలేదు. భావోద్వేగాలపై అపారమైన నియంత్రణ కలిగున్న శ్రీరాముని ఈ లక్షణాన్ని అందరూ అలవర్చుకోవాలి. పరిస్థితి ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. భయపడటం, కోపగించుకోవడం వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయే తప్ప పరిష్కరించబడవు. 

పెద్దలను గౌరవించడం

యువరాజుగా శ్రీరాముడు అడవిలో ఎన్నో భయంకరమైన, ప్రమాదకరమైన జీవితాన్ని గడిపాడు. కానీ ఏనాడూ తన తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రశ్నించలేదు. తండ్రి కోరిక మేరకు తాతకి వంటి రాక్షసులను ఎదుర్కోన్నాడు. సవతి తల్లి కోరిక మేరకు వనవాసానికి వెళ్లాడు. ఆదర్శ బాలుడి ప్రతిరూపం శ్రీరాముడు. తల్లిదండ్రులు పిల్లల మంచి కోసమే ఆలోచిస్తారు. అందుకే తల్లిదండ్రులను ప్రశ్నించకండి. తల్లిదండ్రుల నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండొచ్చు. 

మిత్రుల ప్రాముఖ్యత

లక్ష్మణుడు రాముడికి తమ్ముడు. ఆంజనేయడితో పాటుగా లక్ష్మణుడు కూడా శ్రీరాముడికి పరమ భక్తులు. వీరు రాముడికి అత్యంత సన్నిహితులు. సామ్రాజ్య పాలనను తన సోదరుడు భరతుడికి, కుటుంబ బాధ్యతను తన సోదరుడు శత్రుఘ్నుడికి అప్పగించాడు. మీ కుటుంబం,  తోబుట్టువులు మీ జీవితంలో మీకు లభించే ఉత్తమ స్నేహితులు. అందుకే వీరికి ఎప్పుడూ ద్రోహం చేయకండి. వారిని గౌరవించండి.

ఏకస్వామ్యం

శ్రీరాముడు జీవితంలో సీతాదేవి తప్ప మరే స్త్రీ కి స్థానం ఇవ్వలేదు. అందుకే శ్రీరాముడిని ఏకపత్నీవ్రతుడు అంటారు. సీతాదేవి అపహరణకు సీతను రక్షించేందుకు రావణాసురుడితో యుద్దం చేశాడు. ఒకే స్త్రీని ప్రేమించడం, వివాహం చేసుకోవడం గురించి మాత్రమే ఆలోచించాలి. 

click me!