తీపి అంటే ఇష్టమా..? ఈ విషయం తెలిస్తే దీని జోలికే వెళ్లరు..

Published : Feb 17, 2023, 03:48 PM IST
తీపి అంటే ఇష్టమా..? ఈ విషయం తెలిస్తే దీని జోలికే వెళ్లరు..

సారాంశం

తీపిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. నిజమేంటంటే శుద్ధి చేసిన చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల మీ చర్మం బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా ముఖంపై ముడతలు, మచ్చలు వచ్చి పెద్ద వయసు వారిలా కనిపిస్తారు.   

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక్క ఆరోగ్యం మాత్రమే కాదు మీ చర్మం కూడా దెబ్బతింటుంది. మీ ముఖం చర్మాన్ని మాత్రమే కాదు.. మీ శరీరంలోని అన్ని అవయవాల చర్మాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. శరీరం, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యం. అలా అని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే చక్కెర కూడా ఆరోగ్యానికి అవసరమే. అలాగని దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. 

చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు.  అంతేకాదు మధుమేహంతో బాధపడేవారి చర్మం మరింత సున్నితంగా మారుతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం ఎలా దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మొటిమలు వస్తాయి

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలయ్యే ప్రమాదం పెరుగుతుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మంట కలుగుతుంది. ఇది మొటిమలు,  బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కు దారితీస్తుంది. దీనితో పాటుగా రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం వల్ల శరీరం ఎక్కువ సెబమ్ ను తయారు చేయడం ప్రారంభిస్తుంది. దీని ప్రభావం కూడా చర్మంపై పడుతుంది.  ఇది విపరీతమైన మొటిమలకు దారితీస్తుంది. 

ప్రీ-మెచ్యూర్ ఏజింగ్

చర్మంపై చక్కెర దుష్ప్రప్రభావాలలో అకాల వృద్ధాప్యం ఒకటి. ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల మీ చర్మం అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తుంది. చక్కెర మీ చర్మానికి ఆకారం, నిర్మాణం, దృఢత్వాన్నిచ్చే కొల్లాజెన్, ఎలాస్టిన్ ను విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మీ చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అలాగే చర్మం పొడిబారుతుంది. పిగ్మెంటేషన్ వంటి వృద్ధాప్య సంకేతాలు కూడా కనిపిస్తాయి. 

మంటను కలిగిస్తుంది

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన సోరియాసిస్, ఎగ్జిమా వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది

సెబమ్ అనేది మన శరీరంలో సహజంగా ఉండే ఒక రకమైన నూనె. ఇది మన చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సెబమ్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీని వల్ల చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీ చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల మొటిమలతో పాటుగా ఇతర చర్మ సమస్యలు వస్తాయి. 

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే? 

తక్కువ మొత్తంలో చక్కెర తీసుకోండి

చక్కెరను తీసుకోవడం పూర్తిగా మానేయడం చాలా కష్టం. కానీ దీనిని నియంత్రించొచ్చు. అందుకే ఆహారాలలో తక్కువ చక్కెరను వాడండి. చక్కెరకు బదులుగా పండ్లు, తేనె, ఖర్జూరాలు, బెల్లం వంటి సహజ చక్కెరను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

పుష్కలంగా నీటిని తాగండి

లోపలి నుంచి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొల్లాజెన్, ఎలాస్టిన్ ను ఉత్పత్తి చేయడానికి నీళ్లు బాగా సహాయపడతాయి. అలాగే కీరదోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 

PREV
click me!

Recommended Stories

గులాబీలు గుత్తులుగా పూయాలంటే ఈ ఎరువును వాడండి
Software Employees: ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా ఈ తీవ్ర వ్యాధికి గురవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు