
Diabetes: డయాబెటీస్ దీర్ఘకాలం కొనసాగితే.. గుండె జబ్బులు, అంధత్వం, మూత్రపిండాల విఫలం అయ్యే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే మధుమేహులు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డయాబెటీస్ బారిన చిన్నవయసు వారు సైతం పడుతున్నారు. అయితే ఈ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
అయినా ఈ వ్యాధి అకస్మత్తుగా వచ్చేది అయితే కాదు. ఈ డయాబెటీస్ బారిన పడ్డప్పుడు అలసిపోవడం, మాటిమాటికి టాయిలెట్ కు వెళ్లడం, అతిగా దాహం వేయడం, ఉన్నట్టుండి బరువు తగ్గడం, ఎక్కువగా ఆకలి వేయడం, పాదాలు లేదా చేతులు జలదరిస్తూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ డయాబెటీస్ రావడానికి ముందుగా వచ్చే లక్షణాలు.
ఈ లక్షణాలు గనుక మీలో కనిపించినట్టైతే వెంటనే చెక్ చేయండి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉందని తేలితే.. కొన్ని పద్దతుల ద్వారా మీ షుగర్ లెవెల్స్ ను ఇట్టే కంట్రోల్ చేయొచ్చు. ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపొచ్చు.
ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ మిస్టేక్స్ చేయకూడదు..
డయాబెటీస్ లక్షణాలు మీలో కనిపిస్తే అప్పటి నుంచే మీరు షుగర్ కు దూరంగా ఉండాలి. మీ రోజు వారి ఆహారంలో చక్కెర కలిపిన ఆహారాలను అస్సలు తీసుకోకండి. వీటికి బదులుగా సహజ చక్కెర ఉండే బెల్లం, పండ్లను లేదా తేనెను తీసుకోవచ్చు.
ప్రీ డయాబెటీస్ లక్షణాలు మీలో కనిపిస్తున్నట్టయితే నిత్యం యోగాను చేయండి. యోగా ద్వారా క్లోమం మెరుగ్గా పనిచేస్తుంది.
ప్రీ డయాబెటీస్ లక్షణాలు ఉన్నవారు కంటినిండా నిద్రపోవాలి. అంటే రోజుకు 7 నుంచి 8 గంటలన్నమాట. కంటినిండ నిద్రతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అలాగే శారీరక, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే హార్మోన్లు కూడా సమతుల్యంగా ఉంటాయి.
ప్రీ డయాబెటీస్ రోగి ఖచ్చితంగా తీసుకునే ఫుడ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. వీరు తీసుకునే ఆహారంతోనే చక్కెర స్థాయిలు పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుంది.