సబ్బుతో ముఖం కడిగితే ఏమౌతుందో తెలుసా?

Published : Mar 11, 2023, 11:37 AM IST
సబ్బుతో ముఖం కడిగితే ఏమౌతుందో తెలుసా?

సారాంశం

రోజుకు మూడు నాలుగు సార్లు కూడా సబ్బుతో ముఖాన్ని కడిగేవారున్నారు. కానీ సబ్బుతో ముఖాన్ని కడిగితే ఎన్నో చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.   

చర్మ సంరక్షణలో భాగంగా ముఖాన్ని కడగడం లేదా శుభ్రపరచడం ఒక ముఖ్యమైన భాగం. ముఖం నీట్ గా ఉంటే చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉండదు. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులు బాగా గ్రహిస్తుందని, ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే ధూళి, సూక్ష్మక్రిమి, బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. కానీ సబ్బుతో ముఖాన్ని కడుక్కోకూడదని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించే సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

సబ్బుతో ముఖం కడుక్కోవడం సురక్షితమేనా?

శరీరంలోని మిగిలిన భాగాల చర్మం కంటే ముఖ చర్మం మరింత సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి సబ్బు ముఖ చర్మాన్ని చికాకుపెడుతుంది. పొడిబారేలా చేస్తుంది. దురద, మొటిమలు వంటి ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. సబ్బు మాత్రమే కాదు మీ శరీరాన్ని శుభ్రపరచడానికి మీరు ఉపయోగించే ఏ ఉత్పత్తులను కూడా ముఖాన్ని కడగడానికి ఉపయోగించకూడదు. ముఖానికి క్లెన్సర్ ను ఉపయోగించాలి. ఇది చర్మ సహజ నూనెను తొలగించదు. అలాగే మీ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. సబ్బుతో ముఖాన్ని కడిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దురద, చిరాకు

ముఖాన్ని సరిగ్గా శుభ్రపరచడానికి సబ్బు బార్ ను మీ ముఖంపై నేరుగా రుద్దితే చర్మం దెబ్బతింటుంది. ముఖ చర్మం సున్నితంగా ఉంటుంది. సబ్బులు చిరాకుగా కఠినంగా ఉంటాయి. సబ్బు స్క్రబ్ తర్వాత చర్మం దురద పెడుతుంది. చికాకుగా అనిపిస్తుంది. 

పొడిబారుతుంది

మీ చర్మం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ చాలా సబ్బులు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే సబ్బును ఉపయోగించడం వల్ల మీ చర్మం పిహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాదు సబ్బులు చాలా హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మంలోని సహజ తేమను తొలగిస్తాయి. దీంతో మీ స్కిన్ పొడిబారుతుంది. నీరసంగా మారుతుంది. పొడి చర్మం ఎన్నో చర్మ సమస్యలకు దారితీస్తుంది. 

యూజర్ ఫ్రెండ్లీ కాదు

ఫేస్ వాష్ ను మీచేతి వేళ్లకు పెట్టి ముఖమంతటా అప్లై చేయొచ్చు. అలాగే దీనిని సరిగ్గా శుభ్రపరచొచ్చు. అయితే సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం కష్టమవుతుంది. ఎందుకంటే సబ్బును ఉపయోగిస్తున్నప్పుడు ముఖం అంతటా దీన్ని పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. 

అపరిశుభ్రత

నిజానికి సబ్బులు మనల్ని శుభ్రంగా ఉంచవు. సబ్బుకు మురికి, బ్యాక్టీరియాను గ్రహించే గుణముంటుంది. ఇలాంటి దాన్ని ముఖానికి రాస్తే అక్కడ బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మూసుకుపోయిన రంధ్రాలకు కారణమవుతుంది.

చర్మానికి హానికరం

పారాబెన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన రసాయనాల వల్ల దీర్ఘకాలిక చర్మ నష్టం కలుగుతుంది. సబ్బులోని ఆల్కలీన్ స్వభావం, దాని సువాసన, రంగు వల్ల ఈ సమస్య వస్తుంది. వీటివల్ల మీ చర్మంపై మడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. పొడి చర్మం సూర్యరశ్మికి మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ముఖానికి సబ్బును ఎక్కువ సేపు రుద్దితే మీ చర్మం నీరసంగా మారుతుంది. చర్మం దాని మృదుత్వాన్ని, గ్లోను కోల్పోతుంది.


 

PREV
click me!

Recommended Stories

Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?