
నల్ల ఎండుద్రాక్ష వాటర్ పోషకాల భాండాగారం. దీనిలో ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఎన్నో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. నల్ల ఎండుద్రాక్ష నీరు ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మహిళలు రుతుక్రమ సమస్యలు, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిని రోజు వారి ఆహారంలో చేర్చడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడం, రక్తహీనతను నివారించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆడవారికి ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
నల్ల ఎండుద్రాక్ష నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఇతర హానికరమైన పదార్థాల నుంచి రక్షిస్తాయి. నల్ల ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, ఇతర అవయవాలు శుభ్రపడతాయి.
నెలసరి సమస్యలు
నల్ల ఎండుద్రాక్ష నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ వాటర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం వంటి ఎన్నో నెలసరి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్య వచ్చే అవకాశమే ఉండదు.
రక్తహీనతను నివారిస్తుంది
నల్ల ఎండుద్రాక్ష నీరు ఇనుము, రాగి, వివిధ విటమిన్లకు గొప్ప మూలం. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. నల్ల ఎండు ద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. రక్తహీనత మహిళలను ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
నల్ల ఎండుద్రాక్ష నీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఎల్డిఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించే యాంటీ కొలెస్ట్రాల్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీంతో స్ట్రోక్స్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలు తగ్గిపోతాయి.
లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
నల్ల ఎండుద్రాక్ష నీరు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ఈ వాటర్ లో ఉండే అమైనో ఆమ్లాలు ఉద్వేగాన్ని ప్రేరేపించి గర్భధారణ అవకాశాలను పెంచుతాయి.
స్కిన్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది
నల్ల ఎండుద్రాక్ష నీరు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని నిర్విషీకరణ, యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది.