కసరత్తులకు ముందు వీటిని తీసుకుంటే...

Published : May 14, 2019, 01:22 PM IST
కసరత్తులకు ముందు వీటిని తీసుకుంటే...

సారాంశం

ప్రస్తుత కాలంలో... జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సన్నగా నాజూకుగా ఉండాలని అమ్మాయిలు... కండలు పెంచాలని అబ్బాయిలు తహతహలాడిపోతున్నారు.

ప్రస్తుత కాలంలో... జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సన్నగా నాజూకుగా ఉండాలని అమ్మాయిలు... కండలు పెంచాలని అబ్బాయిలు తహతహలాడిపోతున్నారు. అయితే... అలా జిమ్ లో కసరత్తులు చేయడానికి ముందు ఖాళీ కడుపుతో కాకుండా... కొన్ని రకాల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కసరత్తులు చేయడానికి అరగంట ముందు ఒక అరటి పండు, లేదా ఖర్చురా తీసుకుంటే.. చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా అలసట రాదని... ఎక్కువ సేపు వ్యాయామం చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అంతేకాదు వ్యాయామం అయిపోయాక మరో 30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అరటిపండు, మిల్క్ షేక్, బాదం, అక్రోట్స్, స్ప్రౌట్స్ లాంటివి తీసుకుంటే మంచిది. నీరు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరం నుంచి చెమట రూపంలో పోయిన నీటిని భర్తీ చేయొచ్చు.

PREV
click me!

Recommended Stories

ఇంట్లో ఈజీగా పెరిగే రంగురంగుల పూల మొక్కలు ఇవే!
Hair Growth: జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగాలంటే.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!