సెక్సీ థాట్స్... రోజుకి ఎన్నిసార్లు..?

By telugu team  |  First Published May 10, 2019, 3:50 PM IST

పురుషలకు సెక్సీ థాట్స్ ఎక్కువ అనేది అందరి అభిప్రాయం. వాళ్లు ఎక్కువ శాతం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారని అందరూ భావిస్తుంటారు. 


పురుషలకు సెక్సీ థాట్స్ ఎక్కువ అనేది అందరి అభిప్రాయం. వాళ్లు ఎక్కువ శాతం దాని గురించే ఆలోచిస్తూ ఉంటారని అందరూ భావిస్తుంటారు. ఒకానొక సర్వేలో... పురుషులు ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి శృంగారం గురించి ఆలోచిస్తారని కూడా తేలింది. అయితే... ఈ సర్వేపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి అంటే... రోజంతా అదే ఆలోచన ఉన్నట్లు. ఇదేమీ నిజం కాదని పెద్ద ఎత్తున చర్చలు పెట్టి మరీ ఖండించారు. దీంతో.. మరో సంస్థ దీనిపై సర్వే  చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Latest Videos

అమెరికన్ యువతీ, యువకుల మీద జరిగిన ఒక అధ్యయనం ఆసక్తిని రేపుతోంది. 18 నుంచి 25 యేళ్ల వయసు మధ్య ఉన్న కొంతమంది యువతీయువకులను ఎంచుకుని.. వారిని సర్వేలో భాగం చేస్తూ.. ఈ అధ్యయనం చేశారట. అధ్యయనకర్తలు వాళ్లకు ఏం చెప్పారంటే.. ఒక రోజులో మీకు ఎన్ని సార్లు సెక్స్ గురించి ఆలోచనలు వస్తాయో నోట్ చేయమన్నారు. క్రమం తప్పకుండా లిస్ట్ చేయాలని, ఇలా వారం రోజుల పాటు చేయాలని అధ్యయనకర్తలు సూచించారు. 

మరి ఈ అధ్యయనంలో పాల్గొన్న ఔత్సాహికులు చెప్పిన దాని ప్రకారం.. సగటున అమ్మాయిలు, అబ్బాయిలు ఎన్ని సార్లు సెక్స్ గురించిన ఆలోచనలు చేస్తారో ఒక అంచనాకు వచ్చారు అధ్యయనకర్తలు. ఈ స్టడీ ప్రకారం.. మగవాళ్లు రోజుకు సగటున 34 సార్లు సెక్స్ గురించి ఆలోచిస్తారు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వాళ్లను ఒక రోజులో సగటును 18 సార్లు సెక్సీ థాట్స్ పలకరిస్తాయని తేలింది! 
 

click me!