Corona Vaccine: ప్చ్.. వ్యాక్సిన్ అన్ని నెలలే పనిచేస్తుందట..

By Mahesh RajamoniFirst Published Jan 25, 2022, 4:00 PM IST
Highlights

Corona Vaccine:హమ్మయ్యా ఇక నేను కరోనా నుంచి బయటపడినట్టే.. కరోనా ఎన్ని సార్లు సోకినా నాకేం కాదు. ఎందుకంటే నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాగా.. అని అనందంతో తబ్బుబ్బయ్యే వారికి షాకింగ్ న్యూస్.. ఎందుకంటే..
 

Corona Vaccine: కరోనా రాకతో ప్రపంచ దేశాల పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఈ మహమ్మారి ఎంట్రీతో ప్రజల గుండెల్లో పుట్టిన భయం నేటికీ అలాగే ఉంది. రోజు రోజుకు తన విశ్వరూపాన్ని చూపుతూ .. వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు. అందులోనూ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ సరికొత్త రూపాలను సంతరించుకుంటూ అంటువ్యాధిలా మారింది. అందులోనూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా సులభంగా ఒకరినుంచి మరొకరి వ్యాపిస్తోంది. దీని లక్షణాలు తీవ్రస్థాయిలో లేనప్పటికీ కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
టీకాలు వేసుకుంటేనే ఈ వేరియట్ల నుంచి ముప్పు ఉండదని ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అందుకే ప్రజలందరూ టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అందులోనూ దేశవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో రెండు డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తర్వాత మాకు ఎలాంటి ఆపదా లేదు.. దీని బారిన పడ్డా ఈజీగా బయటపడగలుగుతామనుకునే వారికి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఓ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ వేసుకున్న 30 శాతం మందిలో టీకా వేసుకోవడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ పవర్ ఆరు నెలల తర్వాత తగ్గిపోతుందట. దీంతో కొత్త వేరియంట్ ను ఎదుర్కొనే శక్తి ఉండదా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే బూస్టర్ డోస్ చాలా అవసరమని కొందరు భావిస్తున్నారు.

రెండు డోసుల టీకా తీసుకున్న 1636 మంది ఆరోగ్య కార్యకర్తలపై  Asian Health Foundation,  AIG Hospitals దీనిపై ఈ అధ్యయనం జరిపారు. 1‌00 AU/ml రక్షణ స్థాయి కరోనా రోగులకు పక్కాగా ఉండాలని వారు తేల్చారు. ఒక వేళ రక్షణ స్థాయి ఇంతకంటే తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం పొంచి ఉందని వారు తెలియజేశారు. శరీరంలో 15 AU/ml కంటే తక్కువ Antibody levels ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం లేదని అధ్యయనం తెలుపుతోంది. అంటే ఇలాంటి వారిలో కరోనా నుంచి రక్షణ కల్పించే రోగ నిరోధక శక్తి పెరగదని అర్థం. 

కాగా ఈ అధ్యయనంలో పాల్గొన్న 1636 మందిలో 93 శాతం ప్రజలు  Covshield టీకా వేసుకున్నవారున్నారు. అలాగే కోవాగ్జిన్ వేసుకున్న వారు 6.2 శాతం మంది ఉన్నారు. ఇక మిగిలిన ఒక శాతం స్పూత్నిక్ వ్యాక్సిన్ వేసుకున్నారని అధ్యయనం వెళ్లడించింది.  కాగా రెండు డోసుల టీకా వేసుకున్నా ఆరు నెలల తర్వాత యాంటీ బాడీల లెవెల్స్ 100 AU/mlకంటే తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంటోంది. అది 30 శాతం మందిలో. కాగా వీరు డయాబెటీస్, రక్త పోటు వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలిపారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు టీకాలు వేసుకున్న వీరిలో 6 శాతం మందిలో ఇమ్యూనిటీ పవర్ ఏ మాత్రం పెరగలేదని నిర్దారించారు. ఈ లెక్కన చూసుకుంటే రెండు డోసులు టీకా వేసుకున్నా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చాలా మందే ఉంటారిన నిపుణులు భావిస్తున్నారు.

click me!