Ugadi 2022: ఉగాది పండుగ వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

By Mahesh Rajamoni  |  First Published Mar 28, 2022, 3:51 PM IST

Ugadi 2022: వసంత రుతువులోనే ఉగాది పండుగను జరుపుకుంటాం. అయితే ఈ రుతువులో ఆటలమ్మ, విష జ్వరాలు వంటి ప్రమాదరకమైన వ్యాదులు సోకుతుంటాయి. ఈ వ్యాదులు సోకకుండా చేసే గుణం ఉగాది పచ్చడికి ఉంటుంది. 
 


Ugadi 2022: మరికొన్ని రోజుల్లోనే తెలుగు కొత్త ఏడాది  'శుభకృతు' నామ సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఉగాది పండుగ వసంత రుతువులో వస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందే. అయితే ఈ రుతువులో ఆటలమ్మ, అమ్మవారు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ వంటి ఎన్నో ప్రమాదరకమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల మూలంగా ఎంతో మంది చనిపోతారు కూడా. 

ఇలాంటి సమయాన్నే పండితులు యమద్రంస్టలు అంటుంటారు. అంటే యముడు తన కోరలు చాచి అనేకమంది ప్రణాలు తీస్తాడని అర్థం. కాగా ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతో అవసరం. మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఉగాది వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఇదే.. ఈ రుతువులో వచ్చే అనేక రోగాలకు ఉగాది పచ్చడి చెక్ పెడుతుంది. 

Latest Videos

undefined

ఉగాది స్పెషల్ గా తయారుచేసుకునే ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ  పచ్చడి ఆ ఒక్క రోజే కాదు.. కంటిన్యూగా శ్రీరామ నవమి వరకు తాగాలట. 9 రోజుల పాటు పచ్చడి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. దీంతో ఎలాంటి జబ్బు కూడా మన దరిచేరని సైన్స్ చెబుతోంది. 

ఉగాది పచ్చడిలో ఉండే వేపపువ్వులో పిల్లల కడుపులో ఉండే నులిపురుగులను అంతం చేసే గుణముంటుంది. అంతేకాదు ఆమ్మోరు, ఆటలమ్మ వంటి సమస్యలకు వేపాకు చెక్ పెడుతుంది కూడా.

ఇక మామిడి ముక్కల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి వాతము, కఫము, పైత్యాలను నియంత్రణలో ఉంచుతుంది. చాలా వరకు మనకు వీటివల్లే జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. 

ఉగాది నాడు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనె, నలుగు పిండితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒంటిపై పేరుకుపోయిన విషక్రిమికీటకాలన్నీ తొలగిపోతాయి. 

ఇకపోతే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తమ  ఇండ్లను శుభ్రం చేసుకుంటారు. `ఇంట్లో ఉన్న చెత్త చెదారమంతా బయటపడేస్తారు. ఇండ్లను నీట్ గా కడిగి గుమ్మాలకు మామిడి, వేప, బంతిపూలను తోరణాలను కడతారు. ఇలా చేయడం వల్ల మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కారణంగా మనకు రోగాలు సోకే అవకాశం చాలా తక్కువ. 

బంతిపూవుల్లో యాంటీ బయోటిక్ , యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇక మామిడి ఆకులు మన ఇంట్లోకి రోగకారకాలైన క్రిములను రాకుండా అడ్డుపడతాయి. 

ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు కొంతమంది శ్రీరాముడిని, ఆ సీతమ్మ తల్లిని పూజిస్తుంటారు. ఈ లెక్కన చూసుకుంటే 9 రోజులు ఎంతో పరిషుభ్రంగా ఉంటారు. అంతేకాదు దేవుడికి సమర్పించే మంచి పోషకాహారమే తింటుంటారు. దీనివల్ల మన ఆరోగ్యం ఎంతో బావుంటుంది. 

ఉగాది పండుగను జరుపుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదని అర్థం అయ్యింది కాదా.. ఉగాది పచ్చడి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీరంలో ఉండే ట్యాక్సిన్లు, క్రిములు నశిస్తాయి. ఇక ఆ రోజు చేసే స్నానం వల్ల ఒంటికి పేరుకున్న టాక్సిన్లు తొలగిపోతాయి. 

గుమ్మానికి కట్టే తోరణాల వల్ల క్రిమికీటకాలు మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు. అలాగే శ్రీరామ నవమి వరకు పరిశుభ్రంగా ఉండటం వల్ల ఎలాంటిరోగాలు సోకే అవకాశం ఉండదు. 

చూశారు కదా మన పండుగతో ఎన్ని లాభాలున్నాయో.. ఏదేమైనా మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండుగ వెనక ఏదో ఒక సైటింఫిక్ రీజన్ తప్పకుండా ఉంటుంది. 
 

click me!