
Cancer: ఈ వార్త అందరికీ హెచ్చరిక లాంటిది.. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మీరు ప్రమాదరకమైన జబ్బుల పాలవ్వక తప్పదు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. అదేంటంటే.. కృత్రిమ స్వీటెనర్లను అస్సలు తీసుకోకూడదట.
పంచదార ఆరోగ్యానికి మంచిదికాదనడంతో డయాబెటిస్ పేషెంట్లతో సహా ఇతరులు కూడా కృత్రిమ స్వీటెనర్లను కాఫీ, టీ లలో కలుపుకుని తాగుతున్నారు. కృత్రిమ స్వీటెనర్లతో తయారు చేసిన టీ, కాఫీ, ఇతర పానీయాలను తాగడం వల్ల ఒంట్లో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం చాలా తక్కువ. అలాగే కేలరీలు కూడా బాగా ఖర్చువుతాయి. ఈ కారణంగానే నేడు చాలా మంది ఈ కృత్రిమ స్వీటెనర్లను అధిక మొత్తంలో తీసుకుంటున్నారు.
కానీ ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కృత్రిమ స్వీటెనర్లతో భవిష్యత్తులో డయాబెటీస్ బారిన పడే అవకాశముందని తేల్చేశారు. అంతేకాదు ఈ కృత్రిమ స్వీటెనర్లను అధికంగా వాడటం వల్ల ప్రమాదరకమైన క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఈ విషయాలు అంతర్జాతీయ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యింది.
ఈ విషయంపై 2009 నుంచి అధ్యయనం కొనసాగుతూనే ఉంది. తాజా అధ్యయానంలో ఈ విషయాలు బయటపడ్డాయి. 102,865 మంది ఫ్రెంచ్ పెద్దలపై ఈ అధ్యయనం చేశారు. వీరంతా స్వచ్ఛందంగా పాల్గొన్నవారే. వీరు వారి లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, చేసే పనులు, మెడికల్ హిస్టరీ వంటి సమాచారాన్నంత ఫ్రెంచ్ శాస్తవేత్తలకు తెలియజేశారు.
కాగా ఈ పెద్దవారిలో Artificial sweeteners తీసుకున్న వారి డేటాను పరిశీలిస్తే.. క్యాన్సర్ కు.. Artificial sweeteners సంబంధం ఉందని తేల్చారు. వీరిలో ఎంత మందికి క్యాన్సర్ సోకిందోనన్న విషయాలను కూడా తెలుసుకున్నారు. అందులో వారి వయసు, జెండర్, శారీరక శ్రమ వంటి అనేక విషయాలను బట్టి అంచనా వేశారు.
Artificial sweeteners తీసుుకున్న వారే క్యాన్సర్ బారిన ఎక్కువగా పడ్డారని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. Artificial sweeteners వాడని వారితో పోల్చితే దీన్ని తీసుకునే వారికే 1.13 శాతం క్యాన్సర్ సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వీటిని తీసుకోవడం వల్ల ఆడవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అంతేకాదు అధిక బరువు, ఊబకాయం సమస్యల బారిన కూడా పడారని భావిస్తున్నారు. ఇలా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి లోతైన పరిశోధన జరగాలని పేర్కొంటున్నారు.
శాస్త్రవేత్తలు సూచిస్తున్న ప్రకారం.. పంచదారకు బదులుగా వాడే Artificial sweeteners ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని చెబుతున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.