Longevity: వీటితో మన లైఫ్ టైం పెరుగుతుందట..

Published : Feb 11, 2022, 01:18 PM IST
Longevity: వీటితో మన లైఫ్ టైం పెరుగుతుందట..

సారాంశం

Longevity: కొన్ని రకాల ఆహార పదార్థాలు మన జీవిత కాలాన్నితగ్గిస్తే.. మరికొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఆయుష్షును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు మన ఆయుష్షును పెంచుతాయో తెలుసుకుందాం పదండి..

Longevity: పోషకవిలువలుండే ఆహార పదార్థాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. మెరుగైనా జీవితం పొందాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోకతప్పదు. ఎందుకంటే సరైనా ఆహారం ద్వారానే మన ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఆహార మార్పు ద్వారా ఆయుష్షును కూడా పెంచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మన రోజు వారి ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల మన జీవిత కాలం పెరుగుతుందట. వీటివల్ల పురుషులు తమ జీవితకాలాన్ని13 ఏండ్లు పెంచుకుంటే, మహిళలు 10 ఏండ్లు తమ లైఫ్ టైం ను పెంచుకుంటారని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

A study published in the journal PLOS Medicine ప్రకారం.. ఆడవారు తమ 20 ఏళ్ల వయస్సు నుంచే పోషకవిలువలు మెండుగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే.. వారు తమ లైఫ్ టైం ను 10 ఏండ్లకు పెంచుకోవచ్చట. కాగా పురుషులు 13 ఏండ్లు తమ జీవితకాలాన్ని పెంచుకుంటారట. ఇకపోతే వృద్ధులు కూడా తమ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. అందుకు వారు ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధులు ఆ వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ద్వారా 3.5 ఏండ్ల పాటు తమ లైఫ్ టైం ను పెంచుకోగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. 

balanced diet తీసుకోవడం వల్ల అకాల మరణాలు సంభవించే అవకాశం తగ్గువగా ఉంటుంది. అంతేకాదు దీర్థకాలిక వ్యాధులు సోకే ప్రమాదం కూడా తక్కువేనట. ఆయుష్షును పెంచడంలో బీన్స్, చిక్కుళ్లు, కాయధాన్యాలు, బఠానీలు బాగా సహాయపడతాయి. వీటితో పాటుగా పిస్తాలు, బాదం పలుకులు ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఎన్నో వ్యాధులు మన దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆకు కూరలు, ధాన్యపు ఆహారాలు మన లైఫ్ టైం ను పెంచడానికి సహాయపడగాయని పరిశోధన పేర్కొంటోంది. 

నార్వేకు చెందిన కొంతమంది పరిశోధకులు దీర్ఘాయుష్షును పెంచడానికి ఆహారం ఎంత పాత్ర పోషిస్తుందనే విషయంపై పరిశోధన చేశారు. ఇందుకోసం ఒక Sample కూడా తయారు చేశారు. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, రెడ్ మీట్ తినే ఆడవారు, మగవారు  longevity తో సంబంధం ఎలా కలిగి ఉన్నారనే విషయంపై పరిశోధన చేశారు. అలాగే సమతుల్య ఆహారం అయిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు. ఇందులో మన ఆయుష్షును పెంచడంలో కూరగాయలు, తాజా పండల్లు ఎంతో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు