ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్ ను బాగా గ్రహిస్తుంది.దీంతో తల్లి, బిడ్డ ఇద్దరికీ రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం.
కడుపుతో ఉన్న మహిళలు ఎంత ఆరోగ్యకరమైన, పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే... బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పడుతుందని నిపుణులు చెబుతుంటారు. కేవలం బిడ్డ ఆరోగ్యంగా పుట్టడమే కాదు.. ఆరోగ్యంగా ఎదగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అయితే... గర్భిణీలు నిత్యం తీసుకోవాల్సిన పోషకాహారాల్లో ఆరెంజ్ జ్యూస్ ని చేర్చవచ్చా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.
ఎందుకంటే.. కడుపుతో ఉన్నవారిలో చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురౌతాయి. ఆ సమయంలో పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలనేది కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో చాలా మంది ఆరెంజ్ జ్యూస్ ని కూడా పక్కన పెట్టేస్తుంటారు. అయితే... ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ లో విటమిన్ సీ ఉంటుంది. అది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బిడ్డ శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.దీంతో బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ కచ్చితంగా తాగించాలి.
ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్ ను బాగా గ్రహిస్తుంది.దీంతో తల్లి, బిడ్డ ఇద్దరికీ రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం.
గర్భిణీలలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతుంటారు. కాగా... ఆ సమస్యను ఆరెంజ్ జ్యూస్ తో చెక్ చెప్పవచ్చని చెబుతున్నారు. శక్తి లేనట్లుగా, నీరంగా అనిపించినప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగితే వెంటనే శక్తి వచ్చి ఉత్సాహంగా ఉంటారు.