వేవిళ్లు తగ్గడానికి మందులు సురక్షితమేనా..?

By telugu teamFirst Published Aug 15, 2019, 4:49 PM IST
Highlights

మందులు వేసుకోవడం ఇష్టం లేనివారు కొన్ని చిట్కాలు పాటించి కూడా వీటిని కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి. లాలాజలం ఊరేలా చేసే, వగరుగా ఉండే వక్కలాంటివి బుగ్గన పెట్టుకోవాలి.

గర్భం దాల్చిన ప్రతి స్త్రీకీ వాంతులు కావడం సహజం. అయితే... కొందరిలో ఆ శాతం ఎక్కువగా ఉంటుంది. నెలలు నిండి వస్తున్నా కూడా వేవిళ్లు తగ్గవు. దీంతో.. వాళ్లు కంగారుపడిపోతుంటారు.ఏదైనా తినడానికి కూడా భయపడుతుంటారు. దీంతో... చాలా మంది వాంతులు కాకుండా ఉండేందుకు మందులు వాడుతుంటారు. అవి నిజంగా సురక్షితమేనా కాదా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే... అవి వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

వాంతులు తగ్గడానికి మందులు వాడటం వల్ల నష్టమేమీ ఉండదని చెబుతున్నారు. గర్భంలో కవలలు ఉన్నవారికి వేవిళ్లు అందరికంటే కాస్త ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. నిజానికి వేవిళ్లు వస్తున్నాయంటే మాయ మంచి ఆరోగ్యంగా ఎదుగుతుందని అర్థమని నిపుణులు చెబుతున్నారు. అయితే... మరీ ఎక్కువగా ఉంటే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మందులు వేసుకోవడం ఇష్టం లేనివారు కొన్ని చిట్కాలు పాటించి కూడా వీటిని కంట్రోల్ చేయవచ్చని చెబుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా సమయానికి భోజనం చేయాలి. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి. లాలాజలం ఊరేలా చేసే, వగరుగా ఉుండే వక్కలాంటివి బుగ్గన పెట్టుకోవాలి.

రోజూ తరచుగా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పగటి పూట కాసేపు నిద్రపోవడం కూడా మంచిదే. భోజనం చేసినవెంటనే నిద్రపోకూడదు. ఇవి పాటించినా కూడా వేవిళ్లు ఆగకపోతే.. వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడటం ఉత్తమం. 

click me!