ఆ వీడియోల్లో చూపించేదంతా నిజమేనా..?

By ramya neerukonda  |  First Published Dec 24, 2018, 2:58 PM IST

పోర్న్ వీడియోలకూ, నిజజీవితంలో పడకగది శృంగారానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ వీడియోల్లో కనిపించేదాన్ని గుడ్డిగా నమ్మి.. నిజజీవితాన్ని అప్లై చేసుకోకూడదంటున్నారు నిపుణులు. 


ప్రస్తుత కాలంలో పోర్న్ చూడని యువకులు చాలా తక్కువ మందే ఉంటారు. ఆ వీడియోలు చూసి.. వాటితో తమ నిజ జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటారు. అయితే.. నిజంగా వాళ్లు చూపించే వీడియోల్లో ఉన్నది అంతా నిజమేనా..?

పోర్న్ వీడియోలకూ, నిజజీవితంలో పడకగది శృంగారానికీ ఎంతో తేడా ఉంటుంది. ఆ వీడియోల్లో కనిపించేదాన్ని గుడ్డిగా నమ్మి.. నిజజీవితాన్ని అప్లై చేసుకోకూడదంటున్నారు నిపుణులు. ఆ వీడియోల్లో కనిపించే మహిళలు.. సంతృప్తి పొందినట్లు నటిస్తారట. నిజానికి ఆ వీడియోల్లో బావప్రాప్తి పొందే మహిళలు కేవలం10శాతం మంది మాత్రమే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.  

Latest Videos

సైజు విషయంలో, ముఖ్యంగా పురుషులను అశ్లీల వీడియోలు ఆత్మన్యూనతకు లోను చేస్తూ ఉంటాయి. వీడియోల్లో కనిపించే సైజుల్ని సరిపోల్చుకోవటం కరెక్టు కాదు. పరిమాణం కాదు ప్రభావం ముఖ్యమనేది నిపుణుల సూచన.

సాధారణంగా పురుషులకు మూడు నిమిషాల్లోనే భావప్రాప్తిని పొందుతారట. అదేమీ శీఘ్ర స్కలనం కాదని నిపుణులు చెబుతున్నారు.  ప్రొఫెషనల్‌ జిమ్నాస్ట్‌లు మాత్రమే  పోర్న్‌ వీడియోల్లో కనిపించే భంగిమలను అనుసరించగలరు.  ఆసక్తిగా, కొత్తగా కనిపించే ఆ భంగిమలు నిజజీవితంలో ట్రై చేయడం రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 మహిళలు వెంటనే లైంగిక చర్యకు సిద్ధపడటం చాలా కష్టమట.  లైంగిక క్రీడకు వాళ్లని సన్నద్ధం చేయాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాల ఫోర్‌ప్లే అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!