
srirama navami 2023: ఈ ఏడాది మార్చి 30 గురువారం నాడు శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. శ్రీరామ నవమి నాడు పూజా ముహూర్తం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 01:40 గంటల వరకు ఉంటుంది. శ్రీరామ నవమి విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే వసంత హిందూ పండుగ.
శ్రీరామనవమి 2023 తేదీ, సమయం
రామనవమి పండుగను మార్చి 30 న జరుపుకోనున్నాం.. రామనవమి పూజకు ఉత్తమ పూజా ముహూర్తం మధ్యం ఉంది. నవమి తిథి మార్చి 29, 2023 రాత్రి 09:07 గంటలకు ప్రారంభమై, 2023 మార్చి 30 రాత్రి 11:30 గంటలకు ముగుస్తుంది. శ్రీరామనవమి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మధ్యకాలం అత్యంత పవిత్రమైన సమయమని పూజారులు చెబుతున్నారు.
శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు?
శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం శ్రీరాముడు.. చైత్ర మాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి పూజ ఆచారాలను నిర్వహించడానికి మధ్యకాలాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో శ్రీరామ జపం చేస్తే అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
శ్రీరాముడు ఎవరు?
శ్రీరాముడు హిందూ దేవుడు. విష్ణువు ఏడవ అవతారంగా కూడా శ్రీరాముడిని భావిస్తారు. శ్రీరాముడు చైత్ర మాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు అయోధ్యలో కౌసల్య, దశరథులకు జన్మించాడు. ఇతని తండ్రి దశరథుడు కోసల రాజ్య పాలకుడు. శ్రీరాముడికి లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు తోబుట్టువులు. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. రాజకుటుంబంలో జన్మించినప్పటికీ.. శ్రీరాముడి జీవితం ఎంతో నిరాడంబరంగా గడిపాడు. వాల్మీకి మహర్షి రచించిన హిందూ ఇతిహాసం రామాయణం రాముడి జీవిత కథను వివరిస్తుంది. ఇతిహాసంలో పేర్కొన్న అత్యంత ముఖ్యమైన కథలలో ఒకటి - సీతాదేవిని రాక్షసరాజు రావణుడు అపహరించడం.