Raksha Bandhan: రాఖీ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి...!

By telugu news teamFirst Published Aug 11, 2022, 11:11 AM IST
Highlights

దగ్గరగా ఉన్నవారు రాఖీ కట్టుకుంటారు. కానీ.. విదేశాల్లో, వేరే ప్రాంతంలో ఉన్నవారికి ఇది వీలు పడకపోవచ్చు. అలాంటివారు.. ఒక అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఈ రాఖీ శుభాకాంక్షలు ఎలా తెలయజేయవచ్చో ఓసారి చూద్దాం...

రక్షా బంధన్ చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున ప్రతి ఒక్క సోదరుడు.. తమ అక్కా, చెల్లితో రాఖీ కట్టించుకోవాలని ఆశపడతాడు. పవిత్రమైన దారాన్ని చేతికి రక్షగా కడతారు. అనంతరం స్వీట్లు తినిపిస్తారు. దాదాపు భారతీయులంతా... తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దగ్గరగా ఉన్నవారు రాఖీ కట్టుకుంటారు. కానీ.. విదేశాల్లో, వేరే ప్రాంతంలో ఉన్నవారికి ఇది వీలు పడకపోవచ్చు. అలాంటివారు.. ఒక అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఈ రాఖీ శుభాకాంక్షలు ఎలా తెలయజేయవచ్చో ఓసారి చూద్దాం...

సిస్టర్స్.. బ్రదర్స్ కి విషెస్ చెప్పాలంటే.. ఈ కోట్స్ ఉపయోగించవచ్చు...

- దగ్గరగా ఉన్నా.. దూరంగా ఉన్నా.. మనం ఎల్లప్పుడూ ఒకరి జీవితంలో ఒకరిగా ఉంటాము. రక్షా బదన్ శుభాకాంక్షలు, అన్నయ్య!

- ప్రియమైన అన్నయ్య/ తమ్ముడు, నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించలేను. నువ్వు ఎప్పుడూ  సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, రక్షా బంధన్ శుభాకాంక్షలు.

- మీరు నా జీవితంలో లేకుంటే నా బాల్యం ఎలా గడిచేదో కూడా ఊహించలేను.! రక్షా బంధన్ శుభాకాంక్షలు సోదరా.

- ఆ చివరి చాక్లెట్ ముక్క కోసం, అమ్మా నాన్నల అటెన్షన్ కోసం, బహుమతుల కోసం  మనం చాలా పోరాటాలే చేశాం. కానీ.. అవన్నీ చాలా విలువైన  పోరాటాలు. నేను అది కేవలం నీతో మాత్రమే మళ్లీ మళ్లీ చేయడానికి ఇష్టపడతాను, ప్రియమైన అన్నయ్య! రక్షా బంధన్ శుభాకాంక్షలు.


బ్రదర్స్.. సిస్టర్స్ కి విష్ చేయాలంటే...
- నీ లాంటి సోదరి దొరకడం నా అదృష్టం. నువ్వు నాకు జీవితంలో ఎప్పుడూ వెన్నుముక లా నిలపడ్డావు.  రక్షా బధన్ శుభాకాంక్షలు, ప్రియమైన అక్క!

-  నా జీవితంలో నువ్వే నా మొట్టమొదటి స్నేహితురాలివి. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చయలేరు. హ్యాపీ రాఖీ మై డియర్ సిస్టర్.

- మన జీవితంలో ఇంత ముఖ్యమైన ఈ రాఖీ రోజు.. మనం ఇద్దరూ ఒకే దగ్గర ఉండకపోవచ్చు. కానీ.. నేను జీవితంలో ఎప్పుడూ తోడు ఉంటానని మాట ఇస్తున్నాను. హ్యాపీ రక్షా బందన్. మై డియర్ సిస్టర్. 

-నాకు మరో జన్మ ఉంది అంటే... ఆ జన్మలోనూ నువ్వు నా చెల్లిగా పుట్టాలి. హ్యాపీ రక్షా బందన్. 

-  నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. కానీ నేను పడిపోయిన ప్రతిసారీ వెన్ను తట్టి నన్ను నిలపెట్టింది నువ్వే. నువ్వు నా జీవితంలో ఉంటే.. ఎలాంటి కష్టాన్ని అయినా నేను ఎదురించగలను. హ్యాపీ రక్షా బంధన్ మై డియర్ సిస్టర్. 

click me!