
అప్పుడే ఈ బంధమైనా కూడా బలపడుతుంది. దాని అర్థం ప్రామిస్. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ వీక్ 5వ రోజు ప్రామిస్ డే. ఫిబ్రవరి 11వ తేదీన లవర్స్ ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ప్రేమించిన వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా మనం ఎటువంటి ప్రామిస్ లు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజు నేను నిన్ను ఇష్టపడేలా చేసుకుంటా అని చెప్పడం.. అనగాఎప్పటికప్పుడు ప్రేమిస్తూ మీ ప్రేమతో వారిని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసి వారి హృదయాన్ని గెలుస్తామని చెప్పడం. ఎన్ని ఏళ్ళు అయినా కూడా అంతే ప్రేమగా అంతే అన్యోన్యంగా కలిసి ఉంటామని చెబుతూ మాట ఇవ్వడం. అలాగే ఎటువంటి సమస్య వచ్చిన ఎటువంటి గొడవలు వచ్చినా కూడా హద్దు దాటి మాటలతో బాధపెట్టను అని ప్రామిస్ చేయడం. ఇలాంటివి చేయడం వల్ల మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని నమ్ముతారు.
సంతోషంలో అయిన, దుఃఖంలో అయిన, అనారోగ్యంలో అయిన,ఆరోగ్యంలో అయిన ఎటువంటి సమయంలో అయినా నీకు నేను తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేయడం.. హ్యాపీ ప్రామిస్ డే!
లోకంలో ఎంతమంది ఉన్నా నేను నిన్నే ఎందుకు ఇష్టపడ్డాను అంటే.. ఈ లోకం నన్ను ఒంటరి చేసినా కానీ నువ్వు నాతో నన్ను ఒంటరి చేయవని నమ్మకం అంటూ మోకాళ్లపై కూర్చుని హ్యాపీ ప్రామిస్ డే అని చెప్పండి.
అలాగే అందమైన కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క కూడా బయటికి రాకుండా వారి పెదవులపై అందమైన నవ్వు విరిసేలా చేసుకుంటానని ప్రామిస్ చేస్తూ హ్యాపీ ప్రామిస్ డే చేయండి.
అలాగే ఎటువంటి విషయాలు మాట్లాడటం నచ్చదో అటువంటి వాటి గురించి ప్రస్తావించను, ఎప్పటికీ సంతోషంగా ఉంచుతాను ఇద్దరం కూడా ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా ఉంచుకుందామని మాది ఇవ్వండి.. హ్యాపీ ప్రామిస్ డే!
అలాగే ఎప్పుడూ గతాన్ని తవ్వుకోకుండా, గొడవలు పడకుండా, తప్పులు చేయకుండా ఆనందంగా చూసుకుంటాను అని మాట ఇవ్వండి.. హ్యాపీ ప్రామిస్ డే!
ఎన్ని తప్పులు జరిగిన ముందు తానే కాంప్రమైజ్ అవుతానని చెబుతూ, కాంప్రమైజ్ అవ్వడంలో ఎటువంటి ఇబ్బంది పడను అన్న ప్రామిస్ చేయండి. హ్యాపీ ప్రామిస్ డే!