మీరు ఫోన్లో ఆర్డరిస్తే.. మీ పిల్లలు అలాగే చేస్తారు లావెక్కి‘‘పోతారు’’

By sivanagaprasad KodatiFirst Published Aug 10, 2018, 6:56 PM IST
Highlights

అన్ని పనులు తమంత తామే చేసుకుని.. కాలచక్రాన్ని సరిగ్గా  ఫాలో అయ్యారు కాబట్టే 20, 30 ఏళ్ల క్రితం వరకు మనిషి ఎలాంటి వ్యాధుల బారిన పడలేదు. కానీ కనీసం టీవీ ఆన్ చేయడానికి కూడా శరీరాన్ని ఉపయోగించకుండా.. భోజనం కూడా తయారు చేసుకోకుండా.. ఒక్క క్లిక్‌తో ఇంటికి డెలీవరి తెప్పించుకుంటున్న పరిస్థితుల్లో ‘‘ఒబేసిటీ’’ మానవాళిని కబళిస్తోంది

అన్ని పనులు తమంత తామే చేసుకుని.. కాలచక్రాన్ని సరిగ్గా  ఫాలో అయ్యారు కాబట్టే 20, 30 ఏళ్ల క్రితం వరకు మనిషి ఎలాంటి వ్యాధుల బారిన పడలేదు. కానీ కనీసం టీవీ ఆన్ చేయడానికి కూడా శరీరాన్ని ఉపయోగించకుండా.. భోజనం కూడా తయారు చేసుకోకుండా.. ఒక్క క్లిక్‌తో ఇంటికి డెలీవరి తెప్పించుకుంటున్న పరిస్థితుల్లో ‘‘ఒబేసిటీ’’ మానవాళిని కబళిస్తోంది.

ఒబేసిటీ కదా అని అశ్రద్ధ చేశారో అంతే.. మీ మరణాన్ని మీరే ఆహ్వానించిన వారవుతారు.. కొంచెం, కొంచెం బరువు చాపకింద నీరులా మరణ మృదంగాన్ని మోగిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న దేశాల్లో మనది 14వ  స్థానం.. దేశం మొత్తం మీద 24 శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.. ప్రపంచీకరణ ఫలితంగా జీవనశైలిలో వచ్చిన అనేక మార్పుల ఫలితమే ఒబేసిటీ అంటున్నారు వైద్యులు.

పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, క్యాలరీలు ఎక్కువన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుంది. శరీర భాగాల్లో కొవ్వు పెరిగిపోయి గుండె సంబంధిత షుగర్, కీళ్లనొప్పులు, శ్వాస సంబంధ, గాల్ బ్లడర్, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే రాబోయే తరాన్ని ప్రస్తుత తరం నాశనం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

పిల్లలు ఏదైనా పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. వారి వస్త్రధారణ, అలవాట్లను అనుకరిస్తుంటారు. ఏం కావాలన్నా ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం.. ఇంటికొచ్చాకా సోఫాలో సాగిలపడటం అంతా పిల్లలు గమనిస్తూనే ఉంటారు.

పిల్లలు కూడా ఇప్పుడు అదే బాటలో నడిచి స్థూలకాయం బారినపడతారని అమెరికాలోని బఫెలో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయలు సంపాదించి ఇవ్వడమే కాకుండా.. వారి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

click me!