మలేరియాను నిర్లక్ష్యం చేశారా..? ప్రాణాలు మటాషే

By sivanagaprasad KodatiFirst Published 6, Aug 2018, 4:39 PM IST
Highlights

వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుంది. వీటిలో ప్రధానమైనది మలేరియా.. దోమకాటు వల్ల అత్యధిక మంది ప్రజలు బలౌతున్న వ్యాధుల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది

వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు వ్యాధులను కూడా వెంటబెట్టుకొస్తుంది. వీటిలో ప్రధానమైనది మలేరియా.. దోమకాటు వల్ల అత్యధిక మంది ప్రజలు బలౌతున్న వ్యాధుల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. దీని తీవ్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మలేరియాను కలగేజేసే ప్లాస్మోడియం అనే పరాన్నజీవి దోమ కడుపులో పెరుగుతుంది.

అనాఫిలిస్ అనే ఆడదోమ మనిషిని కుట్టినప్పుడు నోటి ఆ పరాన్నజీవి మనిషి శరీరంలోకి ప్రవేశించి మలేరియాకు కారణమవుతుంది. తీవ్రతను బట్టి మలేరియాను నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఫ్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ఫ్లాస్లోడియం వైవాక్స్, ఫ్లాస్మోడియం ఓవలే, ఫ్లాస్మోడియం మలేరియే.. వీటవిలో ఫ్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియాకు దారి తీస్తుంది.

అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం:
జ్వరం, తలనొప్పి వచ్చిన వెంటనే సాధారణ ట్యాబెట్టు వేసుకుని జ్వరం తగ్గిందని ధీమాగా ఉండకూడదు.. దీని వల్ల పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది.. ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా వైద్యుణ్ని సంప్రదించాలి. వైరస్ మెదడు మీద ప్రభావం చూపించి కన్‌ఫ్యూషన్, మాట తడబటడం వంటి లక్షణాలతో పాటు లివర్ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. 

లక్షణాలు: 
దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి.. తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తలనొప్పి సాధారణంగా కనిపిస్తాయి. చెమటలతో జ్వరం తగ్గి కొంత విరామం తర్వాత తరచుగా జ్వరం వస్తుంటే అది మలేరియాగా అనుమానించాలి.

నివారణ: 
దీనికి ఖచ్చితమైన నివారణ లేదు.. దోమకాటుకు గురికాకుండా ఉండటమే నివారణ మార్గం 
* దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలకు, వెంటిలేటర్లకు నెట్‌లు అమర్చుకోవాలి.
* దోమ తెరలు ఉపయోగించుకోవావలి
* మొక్కలు, పూలకుండీలు, కూలర్లు, ఏసీలలో నీరు మారుస్తూ ఉండాలి.
 

Last Updated 29, Aug 2018, 11:41 AM IST