Obstructive Sleep Apnea: బప్పీలహరి చనిపోవడాని ఈ వ్యాధే కారణం.. ఈ జబ్బు ఎందుకొస్తుంది? ఎలా గుర్తించాలి?

Published : Feb 19, 2022, 11:53 AM IST
Obstructive Sleep Apnea: బప్పీలహరి చనిపోవడాని ఈ వ్యాధే కారణం.. ఈ జబ్బు ఎందుకొస్తుంది? ఎలా గుర్తించాలి?

సారాంశం

Obstructive Sleep Apnea: ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడైన బప్పీలహరి అకాల మరణం సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచేసింది. బప్పీలహరి మరణానికి అసలు కారణాన్ని వైద్యులు వెళ్లడించారు. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాగా అనే వ్యాధి సోకడంతోనే బప్పీలహరి ప్రాణాలు వదిలారట. కాగా ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్నిఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

Obstructive Sleep Apnea: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడైన బప్పీలహరి(69) ఈ నెల 15 న మరణించారు. ఈయన అకాల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రాజకీయ నాయకులు, సినీ పెద్దలు, ప్రముఖ క్రీడాకారులు ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే బప్పీలహరి చనిపోవడానికి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధే కారణమని వైద్యులు స్పష్టం చేశారు. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా గుర్తించాలి? ఎలా నివారించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

 అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటే ఏమిటీ:  కొంతమంది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పడుకున్నప్పుడు గాలి తీసుకోవడానికి రాకపోవడంతో అకస్మత్తుగా మేల్కొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. దీన్నే అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని అంటారు.  ఈ సమస్య ఎక్కువగా నిద్రలోనే జరుగుతుంది. ఈ సమస్య సర్వసాధారణమైనదే అనిపించినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి బ్లడ్ ప్రెజర్ ను అమాంతం పెంచేసి గుండె కొట్టుకోవడం ఆగిపోయేలా చేస్తుందట. ఈ స్లీప్ అప్నియా వల్ల శ్వాస సంబంధమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

లక్షణాలు:

1. పడుకున్న సమయంలో బిగ్గరగా గురక పెట్టడం. 

2. మేల్కొన్న తర్వాత కూడా అలసిపోయినట్టుగానే కనిపిస్తాయి.

3. మార్నింగ్ లేవగానే చిన్నపాటి తలనొప్పి రావడం.

4. ఏకాగ్రత, చికాకు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవడం.

5. గొంతు నొప్పి.

6. తమ రోజు వారి పనులను కూడా చేసుకోవడానికి ఇబ్బందులు పడటం. 

7. నిద్రనుంచి అకస్మత్తుగా మేల్కొవడం.  

8. blood pressure ఎక్కువగా ఉండటం.

కారణాలేంటీ? 

1.అధిక బరువు(ఊబకాయం) సమస్యతో బాధపడటం. 

2. ఆస్తమా సమస్య ఉండటం.

3. సైనసైటిస్, అలెర్జీ సమస్యలు ఉండటం.

4. 17 అంగుళాలకంటే పొడవైన మెడ కలిగి ఉంటే కూడా ఈ వ్యాధి సోకుంతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ వ్యాధిని ఎలా నియంత్రించాలి?

వ్యాధి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాగా ఈ వ్యాధిని పాలిసోమ్నోగ్రఫీ పరికరం ద్వారా నిర్దారించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పరికరం ద్వారా అతడు శ్వాస ఎలా తీసుకుంటున్నాడు? అతని గుండె వేగం ఎలా ఉంది, బీపీ ఎంత మొత్తంలో ఉంది? కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిందని కన్ఫామ్ చేసుకున్నాక వాటిని నియంత్రించేందుకు మీరు ప్రయత్నించాలి. ఎలా అంటే.. మీ శరీర బరువును తగ్గించుకోవాలి. వైద్యులను నిరంతరం సంప్రదిస్తూ వారు సూచించే పద్దతులను క్రమం తప్పకుండా పాటించాలి. 

ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం , నడక వంటివి నిత్యం చేస్తూనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే స్లీపింగ్ పొజీషన్స్ లో కూడా మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Pregnancy Diet: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!
పుస్త‌కం ఓపెన్ చేయ‌గానే నిద్ర ఎందుకు వ‌స్తుంది.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే.?