
గోరు కట్ చేసుకొనే మిషన్ తో గోళ్లను మాత్రమే కత్తిరించగలమని చాలామంది అనుకుంటారు. నిజమే ఈ నెయిల్ కటర్ గోళ్లను సురక్షితంగా కత్తిరించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చిన్నగా ఉండటం వల్ల సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. కాని దీని వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నెయిల్ కటర్ లో రెండు బ్లేడ్లు, ఒక లివర్ ఉంటాయి. ఈ లివర్ సోడా సీసాలను తెరవడానికి సహాయపడుతుంది. కత్తిలా కనిపించే చిన్న బ్లేడ్లు పండ్లను కత్తిరించడానికి, తొక్క తీయడానికి ఉపయోగపడతాయి.
ప్రమాద సమయంలో మహిళలకు నెయిల్ కటర్స్ సహాయపడతాయి. ఇందులో ఉండే రెండు పదునైన బ్లేడ్లను మహిళలు స్వీయ రక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. మహిళలను తప్పుడు ఉద్దేశంతో సమీపించే పురుషుల నుండి తమను తాము రక్షించుకోవడానికి వీటిలోని బ్లేడ్లను ఆయుధంగా ఉపయోగించవచ్చు.
దీన్ని కూడా చదవండి: ఈ 5 జపనీస్ టెక్నిక్స్ తో మానసిక ఒత్తిడి పరార్. జీవితం చాలా కొత్తగా ఉంటుంది
నెయిల్ కటర్ దిగువ భాగంలో ఉన్న చిన్న రంధ్రం డిజైన్ కోసం పెట్టిందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. గోళ్లు కత్తిరించడానికి ఒక పట్టు అవసరం. నెయిల్ కటర్ లోని బ్లేడ్లు ఈ చిన్న రంధ్రంతో అనుసంధానమై ఉంటాయి. ఇది బ్లేడ్లను సింపుల్ గా తిప్పడానికి, తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. కాలి వేళ్ల గోళ్ల చివర్లు వంటి కఠినమైన భాగాలను కత్తిరించేటప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.
దీన్ని కూడా చదవండి: ప్రతి రోజు రొమాంటిక్‌గా, ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి
నెయిల్ కటర్ లో ఉన్న రంధ్రాన్ని కీ చైన్‌తో కలిపి కీ చైన్‌లా ఉపయోగించవచ్చు. దీనివల్ల ఆఫీసులకు వెళ్లేటప్పుడు, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా గోళ్లు కట్ చేసుకోవడానికి వీలవుతుంది. తాళంతో తీసుకువెళ్లడం వల్ల గోరు కత్తిరింపులోని బ్లేడ్లను అత్యవసర పరిస్థితుల్లో రక్షణకు ఉపయోగించవచ్చు.
సాధారణంగా అల్యూమినియం లేదా ఇనుప తీగలను వంచడం కష్టంగా ఉంటుంది. నెయిల్ కటర్ లోని చిన్న రంధ్రం ద్వారా అల్యూమినియం తీగలను చొప్పించి వాటిని సులభంగా వంచవచ్చు. దోమల కాయిల్‌ను బ్లేడ్‌లో గుచ్చి స్టాండ్ లా కూడా నెయిల్ కటర్ ని ఉపయోగించవచ్చు.
గోళ్లను కట్ చేసేటప్పుడు దాని పక్కన, కింద పేరుకుపోయిన మురికిని తొలగించడానికి ఈ బ్లేడ్లు ఉపయోగపడతాయి. ఇది కాకుండా ఆ బ్లేడ్ల ను ఉపయోగించి నట్స్, బోల్ట్‌లు బిగించవచ్చు.