దోమ కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ మాత్రమే కాదు ఈ భయంకర రోగం కూడా వస్తుందా?

Published : Aug 26, 2025, 03:19 PM IST
Mosquito bites

సారాంశం

దోమ కుట్టడం వల్ల ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వాటిలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటివి ఉన్నాయి. అయితే చాలా మంది దోమలు హెచ్ఐవీని కూడా వ్యాప్తి చెందిస్తాయని భావిస్తారు. ఇది నిజమో కాదో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

దోమలు కుట్టడం వల్లే ఎన్నో రోగాలు రావడం మాత్రమే కాదు, వ్యాప్తి కూడా చెందిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, జికా వంటి జబ్బులను ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేలా చేస్తాయి. దోమలు చేరకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోమని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇంటి చుట్టూ చెత్తా చెదారం, నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెబుతారు. దోమల వల్ల వచ్చే రోగాల గురించి ఎంతో మందికి తెలుసు. కానీ అవి HIV వైరస్ ను కూడా వ్యాప్తి చెందిస్తాయనే వాదన కూడా ఉంది. అది ఎంత వరకు నిజమో వైద్యులు చెబుతున్నారు. 

దోమలు మనిషి రక్తాన్ని పీల్చడం ద్వారా ఆహారాన్ని, పోషకాలను పొందుతాయి. కానీ అవి రక్తాన్ని పీల్చుకున్నాక ఆ రక్తాన్ని తమ శారీరక అవసరాలకు వాడుకుంటాయి. కానీ వేరొక జీవి శరీరంలోకి ఆ రక్తాన్ని ప్రసారం చేయవు. హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందడానికి హెచ్ఐవి వైరస్ ఉన్న రక్తం వేరొకరి శరీరంలోని రక్తంలోకి ప్రవేశించాలి. హెచ్ఐవి వ్యాప్తి చెందడానికి అవసరమయ్యే పరిస్థితులు జీవసంబంధమైన విధానాలను తోమలు కలిగి ఉండవు.

దోమలు హెచ్ఐవిని ఎందుకు వ్యాప్తి చేయలేవు?

వైద్యనిపుణులు చెబుతున్న ప్రకారం దోమలు హెచ్ఐవిని వ్యాప్తి చెందించలేవు. దోమ తినే విధానం విభిన్నంగా ఉంటుంది. అది నోటి నుంచి రెండు గొట్టాలను కలిగి ఉంటుంది. ఒక గొట్టం నుండి రక్తాన్ని పీల్చుకుంటే, మరొకటి శరీరం పై దోమ చేసి కాటులోకి లాలాజనాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే సమ్మేళనాలు లాలాజలంలో ఉంటాయి. దీనివల్ల రక్తం సులభంగా దోమ పీల్చుకోగలుగుతుంది. అంటే దోమలు తన లాలాజలాన్ని మాత్రమే శరీరంలోకి ఇంజక్ట్ చేస్తుంది. ఇతరుల రక్తాన్ని కాదు కాబట్టి హెచ్ఐవి వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు దోమల ద్వారా వ్యాప్తి చెందడం కష్టం.

దోమ హెచ్ఐవి ఉన్న వ్యక్తిని కుట్టిన తర్వాత మరొక వ్యక్తిని కుడితే ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని భయం అవసరం లేదు. ఎందుకంటే దోమలకు హెచ్ఐవి వైరస్ ను గ్రహించే శక్తి ఉండదు. వైరస్ దోమ శరీరంలో చేరలేదు. దోమలు రక్తాన్ని బదిలీ చేయవు. కేవలం తమ లాలాజలాన్ని మాత్రమే ఇంజెక్ట్ చేస్తాయి.

హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది?

హెచ్ఐవి వ్యాపించాలంటే హెచ్ఐవి బారిన పడిన వ్యక్తి రక్తం ఇతరుల శరీరంలోకి చేరాలి. లేదా వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాలు, మలద్రవాలు ద్వారా మాత్రమే ఇచ్చేవి సంక్రమిస్తుంది. హెచ్ఐవి ఉన్న వ్యక్తికి గుచ్చిన ఇంజెక్షన్స్ సూదితో ఇతరులకు గుచ్చితే ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు. ప్రసవ సమయంలో లేదా గర్భధారణ సమయంలో లేదా తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వ్యాపించే అవకాశం ఉంది. కానీ దోమల వల్ల మాత్రం హెచ్ఐవి వ్యాపించే అవకాశం దాదాపు అసాధ్యం.

దోమలతో ఈ వ్యాధులు వస్తాయి

దోమలు హెచ్ఐవిని వ్యాప్తి చేయలేకపోవచ్చు. కానీ ప్రాణాలు తీసే తీవ్రమైన వ్యాధులను అవి వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఫైలేరియాసిస్, జపనీస్ ఎన్సెఫాలిటీస్, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్, జికా వైరస్, డెంగ్యూ ఇవన్నీ కూడా మానవాళికి ప్రాణాంతకమైనవి. వీటిని ఒక మనిషి నుండి మరొక మనిషికి వ్యాప్తి చెందించడంలో దోమలు చురుగ్గా పనిచేస్తాయి. కాబట్టి దోమలను ఇంట్లో లేకుండా నివారించడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. కానీ దోమల వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశం మాత్రం లేదు.

దోమల్లేని దేశం ఏది?

ప్రపంచంలోని అన్ని దేశాలు దోమల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ దోమలు లేని ఏకైక దేశం ఐస్లాండ్. ఐరోపాలో ఉన్న ఈ దేశంలో దోమ ఒకటి కూడా కనిపించదు. అందుకే అక్కడ దోమల వల్ల కలిగే రోగాలు కూడా చాలా తక్కువ. ఐస్లాండ్ దేశం శీతల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది దోమలకు అనుకూలమైన పరిస్థితులను కలిగి ఉండదు. అక్కడ ఉండే మట్టి, నీటి వనరులు కూడా కొన్ని రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి దోమల జీవితచక్రానికి అవసరమైన పోషకాలను ఇవ్వలేదు. అందుకే దోమలు ఐస్లాండ్ లో ఉండలేవు. ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ దోమ జాతులు ఉన్నాయి. కానీ ఐస్లాండ్ లో మాత్రం ఒక్క దోమ కూడా కనిపించదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు