గుప్పెడు గులాబీ రేకులతో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి, చర్మం మృదువుగా మెరిసిపోతుంది

Published : Aug 26, 2025, 11:29 AM IST
Rose Petals

సారాంశం

చర్మ సంరక్షణలో పువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గులాబీ పువ్వులు చర్మానికి అందాన్ని, మృదుత్వాన్ని ఇచ్చేందుకు ముందుంటాయి. గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇచ్చాము. దీన్ని చాలా సింపుల్ గా తయారు చేయవచ్చు. 

ముఖం మృదువుగా ఉంటే చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. కొందరికి మొటిమలు, మొటిమల వల్ల కలిగిన మచ్చలు ఏర్పడతాయి. అలాగే చర్మం నల్లగా, నిర్జీవంగా మారిపోతుంది. అలాంటివారు ప్రత్యేకంగా చర్మ సంరక్షణ చేసుకోవాలి. అందుకోసం గులాబీ రేకులతో కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. గులాబీ రేకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ నేను గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇచ్చాము. వారానికి ఒక్కసారి ఇలా గులాబీ రేకుల ఫేస్ ప్యాక్ వేసుకోండి .చర్మం మృదువుగా లేత గులాబీ రంగులో మెరిసిపోతుంది.

గులాబీ రేకుల ఫేస్ ప్యాక్ ఇలా

గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి గుప్పెడు గులాబీ రేకులను తీసుకోండి. అలాగే ముల్తానీ మిట్టి, తేనె, కలబంద జెల్ రెడీ చేసుకోవాలి. ముందుగా గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులోనే కలబంద జెల్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో ముల్తానీ మిట్టి, తేనే కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఆ మృదువైన పేస్టును ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు. ఆ తర్వాతే ఈ పేస్టును అప్లై చేసి చేత్తో సున్నితంగా మసాజ్ చేయాలి. ముఖంపై పలుచని పొరలాగా అప్లై చేసుకోవాలి. దాని అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత టిష్యూ పేపర్ ను తడిపి ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మృత చర్మ కణాలను తొలగిస్తుంది. తక్షణమే మెరిసే చర్మాన్ని ఇస్తుంది. ముఖంపై ఉన్న టానింగ్ కూడా చాలా వరకు పోతుంది.

గులాబీ పూల పొడితో...

ఇంట్లో గులాబీ పువ్వులు పూసినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను తరచూ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది అద్భుతంగా పనిచేసే బ్యూటీ టిప్. ఒకసారి వేసుకున్నారంటే మీకు దీని రిజల్ట్ తెలుస్తుంది. మీ ఇంట్లో గులాబీ పువ్వులు లేకపోతే ఆన్లైన్ లో గులాబీ రేకుల పొడిని కూడా అమ్ముతున్నారు. దాన్ని కూడా మీరు ఫేస్ ప్యాక్ కోసం వినియోగించుకోవచ్చు. గులాబీ రేకుల పొడిని కొంటున్నప్పుడు అది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా తయారుచేసినదా లేదా తెలుసుకొని కొనుక్కోవడం ఉత్తమం. కలబంద జెల్ లో గులాబీ రేకుల పొడి.. రెండూ కొని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు