డెలివరీ టైమ్ లో హార్ట్ ఎటాక్..?

By ramya neerukondaFirst Published Jan 28, 2019, 3:54 PM IST
Highlights

 స్త్రీలు బిడ్డకు జన్మనివ్వడం అంటే.. మరో జన్మ ఎత్తడం లాంటిదని చెబుతూ ఉంటారు. అది మరోసారి రుజువు అయ్యింది. 


స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుంచి మళ్లీ డెలివరీ అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే.. డెలివరీ సమయంలో ఎదైనా ఇబ్బంది ఏర్పడితే తల్లితోపాటు.. కడుపులో బిడ్డకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి. 

ఇదిలా ఉంటే.. స్త్రీలు బిడ్డకు జన్మనివ్వడం అంటే.. మరో జన్మ ఎత్తడం లాంటిదని చెబుతూ ఉంటారు. అది మరోసారి రుజువు అయ్యింది. ఎందుకంటే.. ప్రసవ సమయంలో చాలా మంది గర్భిణీలు హార్ట్ ఎటాక్ కి గురౌతున్నారంట. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 

గర్భిణులు ప్రసవించే సమయంలో గుండెకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ప్రసవ సమయంలో ఏర్పడే ఒత్తిడి, రక్తపోటు వంటివి గుండె సంబంధిత సమస్యలను పెంచుతున్నాయని చైనాలోని హుజాంగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించింది.

 ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది గర్భిణులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ప్రసవ సమయంలో కలిగే మార్పుల కారణంగా 4ు మేర గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు వృద్ధి చెందుతున్నాయని గుర్తించారు.

click me!