చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

Published : May 05, 2023, 12:34 PM IST
 చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

సారాంశం

  Lunar Eclipse 2023: శాస్త్రీయంగా గ్రహణం సమయంలో ఇవి తినాలి.. అవి తినకూడదు అన్న నిబంధనలేమీ లేవు. కానీ జ్యోతిష్యుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్నింటిని తినాలి... ఇంకొంన్నింటిని తినకూడదని చెబుతారు. మరి ఈ చంద్రగ్రహణం సమయంలో ఎలాంటివి తినాలి? ఎలాంటివి తినకూడదంటే..? 

Lunar Eclipse 2023: సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి రావడాన్ని చంద్రగ్రహణం అంటారు. ఇలా భూమి.. సూర్యచంద్రుల మధ్యలోకి వచ్చినప్పుడు సూర్య రశ్మి చంద్రుడిపై పడకపోవడం వల్ల మనకు చంద్రుడు కనపడడు. దీనినే చంద్ర గ్రహణం అంటారు. గ్రహణం చాలా అరుదుగా వస్తుంది. సాధారణంగా చంద్ర గ్రహణాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఉంటాయి.  మే 5వ తేదీన అంటే ఈ రోజు పెనుంబ్రాల్ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో దీన్ని చూడొచ్చు. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది.

ఈ ఖగోళ సంఘటన న్యూఢిల్లీ, ముంబైలో మే 5 న రాత్రి 10:52 గంటల నుంచి మే 6 తెల్లవారుజామున 01:6 గంటల వరకు పెనుంబ్రాల్ చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చు. పెనుంబ్రాల్ గ్రహణాన్ని ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో చూడొచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో పెనుంబ్రాల్ గ్రహణం అస్సలు కనిపించదని Space.com తెలిపింది. 

గ్రహణాల విషయానికి వస్తే.. సూర్య లేదా చంద్ర గ్రహణం సమయంలో.. ఆహారపు అలవాట్ల చుట్టూ ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. 

గ్రహణం రోజున ఆహారం తినొచ్చా?

ఆధునిక శాస్త్రం ప్రకారం..గ్రహణం రోజున తినడానికి, ఆరోగ్య సమస్యలకు మధ్య స్పష్టమైన సంబంధం లేదు. అయితే చంద్రుని చక్రాలు మన శరీరాలను మానసికంగా ప్రభావితం చేస్తాయని అనేక పురాతన నమ్మకాలు చెబుతున్నాయి. గ్రహణం రోజున మనం తీసుకునే ఏ ఆహారమైనా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయని నమ్ముతారు.

జ్యోతిష్యులు గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో తినకూడదు, తాగకూడదని చెప్తుంటారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో వంట చేయడం లేదా హెవీగా తినడం మంచిది కాదంటారు. ఈ సమయంలో తినడం వల్ల గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందని నమ్ముతారు.

గ్రహణానికి ముందు, గ్రహణ సమయంలో, ఆ తర్వాత చేయాల్సిన, చేయకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం తినాలి

గ్రహణం రోజున గ్రహణం ప్రారంభం కావడానికి ముందే తినండి. అది కూడా తక్కువ నూనెలో తయారుచేసిన సింపుల్ వెజిటేరియన్ ఫుడ్ నే తినాలని చెబుతున్నారు. రోటీ, పప్పు, సబ్జీ వంటి సీజనల్ ఫుడ్స్ ను తీసుకోవాలి. పసుపు, తులసిని మీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చండి. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కొన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటితో పాటుగా తులసి ఆకుల టీ, కొబ్బరి నీరు, అల్లం నీరు , తాజా పండ్లను తీసుకోండి. 

ఏం  తినకూడదు? 

గ్రహణం సమయంలో లేదా ఆ తర్వాత ముందు వండిన ఆహారాన్ని తినకండి. ఎందుకంటే ఇది కలుషితం అవుతుంది. ముడి ఆహారాన్ని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వెలువడే కిరణాలు మీ ఆహారంలోకి కొన్ని బ్యాక్టీరియాను తీసుకువస్తాయని నమ్ముతారు. ఇది మీ శరీరంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నమ్ముతారు.అందుకే ముడి ఆహారాన్ని తినొద్దని జ్యోతిష్కులు సలహానిస్తారు. చికెన్, పంది మాంసం, చేపలు, మటన్ వంటి మాంసాహారం తినకూడదని జ్యోతిష్యం చెబుతోంది. మందును తాగకూడదు. సిగరెట్లును కాల్చకూడదు. గ్రహణం సమయంలో ఫుడ్ ను మార్చాలనుకుంటే..  ముఖ్యంగా మీకు డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే..ముందు వైద్యుడిని సంప్రదించాలి. 
 

PREV
click me!

Recommended Stories

చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు
బంగారానికి పోటీ ఇచ్చేలా మెరిసే వెండి ఉంగరాలు