ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ నుంచి ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే వీటికి బదులుగా రాగి వాటర్ బాటిల్ లేదా కుండ నీళ్లను తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతారు. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మంచిదంటే..
కాపర్ బాటిలో లేదా మట్టి కుండ నీళ్లను తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాగా ఈ రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, నష్టాలు ఉన్నాయి. రాగి శరీరంలో ఒక భాగం. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. నాడీ కణాలు, రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొల్లాజెన్, ఎముకలు, కణజాలాలను నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. కాగా మట్టి కుండలు నీళ్లు మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఈ రెండింటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రాగి సీసాల్లో నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధన ప్రకారం.. రాగి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇది హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరం ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది.
రాగి వాటర్ బాటిల్ నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. హృదయనాళ వ్యవస్థకు కూడా సహాయపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో రాగి పాత్ర ఉంది. కాబట్టి రాగి బాటిల్ నుంచి నీటిని తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మట్టికుండ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మట్టి కుండ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. కుండ వేసవిలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
మట్టిలో నిల్వ చేయబడిన నీరు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మనం తినే ఆమ్ల ఆహారాలను సమతుల్యం చేస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.
ప్రతిరోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
దీని శీతలీకరణ ప్రభావం కారణంగా.. ఇది వడదెబ్బ, హీట్ స్ట్రోక్, విరేచనాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
ఇది నేచురల్ ప్యూరిఫైయర్. పోరస్ మైక్రో-టెక్చర్ నీటిలోని కలుషితాలను నిరోధిస్తుంది