
Iron deficiency symptoms: ఈ ఆధునిక కాలంలో మనుషులకు తమ కెరీర్ గురించే తప్ప మరే విషయాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కెరీర్ ప్లానింగ్, వర్క్ బిజీలో పడి తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. వర్క్ బిజీలో పడి ఎంతో మంది తమ శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయో కూడా గుర్తించడం లేదు. దీనివల్ల రోగాలు ముదిరి ప్రాణాల మీదికి వస్తున్నాయి.
ఇనుము లోపం.. ఏ చిన్న పని చేసినా.. చేయకపోయినా.. అలసిపోయినట్టుగానే ఉంటున్నారా.. అలాగే ఉన్నట్టుండి మీ పాదాలు, చేతులు చల్లబడుతున్నాయి.. ఇవన్నీ మీ ఒంట్లో ఇనుము లోపం ఏర్పడిందడానికి సంకేతాలు. శరీరంలో ఇనుము లోపం ఏర్పడటం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మహిళలకు.
ఐరన్ లోపం లక్షణాలు ఇలా ఉంటాయి..
1. పాదాలు, చేతులు అకస్మత్తుగా చల్లబడుతుంటాయి.
2. బలహీనంగా ఉంటారు
3. పనిచేసినా చేయకపోయినా అలసిపోవడం
4. చర్మం పసుపు రంగులోకి మారడం
5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది
6. జుట్టు ఊడిపోవడం
7. మైకము
8. గోర్లు పగుళ్లు ఏర్పడటం
9. ఛాతి, గొంతు నొప్పి
10. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉండటం
11. Heart rate ఎక్కువ లేదా తక్కువగా ఉండటం
ఐరన్ లోపానికి కారణాలు.. ఎర్ర రక్తకణాలకు ప్రోటీన్ ను అందించడానికి, హీమోగ్లోబిన్ తయారీకి ఐరన్ ప్రముఖ ప్రాత పోషిస్తుంది. ఇనుము హిమోగ్లోబిన్ యొక్క ముఖ్య మూలకం కూడా. ఎర్ర రక్తకణాల ద్వారానే ఆక్సిజన్ మన శరీరంలోని ప్రతి భాగానికి చేరకుంటుంది. ఒకవేళ రక్తం ఆక్సిజన్ ను సరిగ్గా సరఫరా చేయకపోతే లేదా ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా మీరు రక్తహీనత సమస్య బారిన పడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఐరన్ లోపించడం. ఈ సమస్య మూలంగానే మీరు తరచుగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు.
ఇనుము పెరగాలంటే.. బ్రోకలి, ఎండిన బఠాణీలు, బీన్స్, బచ్చలికూర, ఆకుపచ్చ కూరగాయలను తింటే ఐరన్ పుష్కలంగా అందుతుంది. మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్, చేపులను తరచుగా తింటే మీ శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది.