
international womens day 2023: ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1975 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. సమాజంలో మహిళల పాత్ర చాలా పెద్దది. వీళ్లు లేకుంటే ఈ ప్రపంచమే ఉండదు. విద్యా, ఉద్యోగం, రాజకీయం అంటూ ప్రతి రంగంలో ఆడవారు రానిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితం చేసిన ఆడవారు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలే స్థాయికి చేరుకున్నారు. ఆడవారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అందుకే ఆడవారు ఎదిగేందుకు మన వంతు సహాకారం అందించాలి. ఇకపోతే ప్రతి ఒక్కరి జీవితంలో స్పెషల్ ఉమెన్ ఉంటుంది. అమ్మైనా, చెల్లి, ఆలి, ఫ్రెండ్ ఇలా ఎవ్వరైనా ఉండొచ్చు. వారు మీకెంత స్పెషలో గిఫ్ట్ ఇచ్చి చెప్పేయొచ్చు. మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా వారి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలంటే..?
పుస్తకాలు
చాలా మంది ఆడవారికి పుస్తకాలను బాగా ఇష్టపడతారు. అందుకే మీకు ఇష్టమైన వారికి పుస్తకాలను చదవడం ఇష్టం అయితే వారిని నచ్చిన పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఏండ్ల తరబడి వారితోనే ఉండిపోయే గిఫ్ట్ ఇది. కావాలనుకుంటే ఫిక్షన్-నాన్-ఫిక్షన్, కామెడీ, కవిత్వం, నవల, కళ, సాహిత్యం ఇలా ప్రపంచానికి సంబంధించిన ఏ పుస్తకాన్నైనా బహుమతిగా ఇవ్వొచ్చు. తనకిష్టమైన రచయిత పుస్తకాన్ని ఇస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది.
మొక్కలు
మొక్కల ప్రేమికులు చాలా మందే ఉంటారు. అందులో ఆడవారికి మొక్కలంటే మహాఇష్టం. మొక్కలను చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఈ రోజుల్లో చాలా మంది ఒకరికొకరు మొక్కలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. నిజానికి మొక్క ఒక గొప్ప బహుమతి. ఎందుకంటే మొక్కను చూడగానే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇంట్లో పచ్చదనం ఉండటం వల్ల పాజిటివ్ థింకింగ్, ఎనర్జీ కూడా వస్తుంది. ఇంటి వాతావరణం తాజాగా ఉంటుంది. ఏ మహిళకైనా మొక్కలు నాటడం, ఇండోర్ మొక్కల పెంపకాన్ని ఇష్టమైతే వారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి. కావాలనుకుంటే ఒక బొకే కూడా ఇవ్వొచ్చు.
హ్యాంపర్స్ ఇవ్వండి
ఈ రోజుల్లో హ్యాంపర్స్ ఇచ్చే ట్రెండ్ నడుస్తోంది. మేకప్ ఐటమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ మొదలైన వాటిని కూడా హ్యాంపర్ లో మిక్స్ చేసి మహిళా దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ గా ఇస్తే వారి ఆనందానికి అవదులు ఉండవు.
మొబైల్
మీ చెల్లికి లేదా అమ్మకు లేదా స్నేహితులకు వాచ్ లేదా మొబైల్ అవసరమైతే ఈ ఉమెన్స్ డే సందర్భంగా వీటిని గిఫ్ట్ గా ఇచ్చి వారిని ఆశ్చర్యపరచొచ్చు. మొబైల్ సరిగ్గా పనిచేయకపోతే ఎలాగూ కొత్త ఫోన్ ను కొనాల్సి వస్తుంది. అందుకే మీ అమ్మ లేదా చెల్లికి ఇలాంటి సమస్య ఉంటే వారికి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇవ్వండి. వారెంతో సంతోషిస్తారు.
ఇయర్ బడ్స్
ఈ రోజుల్లో చాలా మంది ఇయర్ బడ్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో యూజ్ అవుతుంది కూడా. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చెవిలో వీటిని పెట్టుకోవడం వల్ల ఎవరితోనైనా కాల్ సౌకర్యవంతంగా మాట్లాడొచ్చు. పాటలు వినొచ్చు. ముఖ్యంగా వీటిని సెలక్ట్ చేయడంలో ఇష్టాఇష్టాలు అనే సమస్యే ఉండదు. బెస్ట్ కంపెనీది కొనిస్తే చాలు.