ఈ ఆకు రసంతో కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు ఆ సమస్యలు కూడా దూరం?

Published : Feb 27, 2023, 02:20 PM IST
ఈ ఆకు రసంతో కిడ్నీలో రాళ్లు కరగడమే కాదు ఆ సమస్యలు కూడా దూరం?

సారాంశం

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఒకటి.  

ఇలా ఎన్నో రకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది అయితే ఇలా కిడ్నీలో సమస్యలు రావడానికి మనం తీసుకునే ఆహార పదార్థాలు మన జీవన శైలి కారణమని చెప్పాలి. అయితే కొందరికిడ్నీలో రాళ్లు ఏర్పడి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వాళ్ళు కేవలం ఈ ఆకు రసంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా మన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి కానీ వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలియక మనం వాటిని చాలా తేలికగా తీసుకుంటాము. ఈ క్రమంలోని ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి మొక్కలలో అటిక మామిడి తీగ కూడా ఒకటి. ఇది మన పరిసర ప్రాంతాలలో ఎంతో విరివిగా లభిస్తుంది.

అటిక మామిడి తీగ రసం వల్ల కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవచ్చు. అటిక మామిడి తీగలోనే ఆకులు, పువ్వులు, వేర్లుచిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండువందల మిల్లీలీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి ఇలా ఏడు నిమిషాల పాటు మరిగించిన తర్వాత వడగట్టుకుని ఈ కషాయాన్ని సేవించాలి ఇలా ప్రతిరోజు ఉదయం 50 ml కషాయాన్ని తాగడం వల్ల ఇది మన శరీరానికి సర్వ రోగ నివారణగా పనిచేస్తుంది.

ఈ విధంగా ఈ కషాయం కేవలం కిడ్నీ సంబంధిత సమస్యలను మాత్రమే కాకుండా మన శరీరంలో అన్ని జీవక్రియలు సరైన క్రమంలో పని చేయడానికి కారణం అవుతుంది. గుండె పనితీరును మెరుగపరచడానికి జీతక్రియ శక్తిని మెరుగుపరచడానికి కూడా అధిక మామిడి తీగ ఎంతగానో దోహదం చేస్తుంది. డయాలసిస్ సమస్యతో బాధపడేవారు కూడా ఈ అటిక మామిడి కషాయం తీసుకోవడంతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ అటిక మామిడి రసం తీసుకునేవారు దీనిని తీసుకోవడానికి ముందు ఓసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు తీసుకోవడం ఎంతో మంచిది.

PREV
click me!

Recommended Stories

Health Tips: చలికాలంలో బెండకాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?