ఈ ఏడాది నగరవాసులు స్విగ్గీ యాప్ లో ... ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసారో తెలుసా.... హైదరాబాద్ బిర్యానీ(చికెన్).కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఏడు ప్రముఖ నగరాలపై స్విగ్గీ ఈ సర్వే చేపట్టింది. కాగా.. ఈ ఏడు నగరాల్లోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటు వేయడం విశేషం.
ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ బిర్యానీ తన సత్తా చాటింది. ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ గా హైదరాబాద్ బిర్యానీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ.. చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది నగరవాసులు స్విగ్గీ యాప్ లో ... ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసారో తెలుసా.... హైదరాబాద్ బిర్యానీ(చికెన్).కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఏడు ప్రముఖ నగరాలపై స్విగ్గీ ఈ సర్వే చేపట్టింది. కాగా.. ఈ ఏడు నగరాల్లోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటు వేయడం విశేషం.
మధ్యాహ్నం సమయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, పెరుగన్నం ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఇక రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, తందూరి చికెన్, దాల్ మకనీ, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ, కడాయి పనీర్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు.
అర్థరాత్రి సమయంలో చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, దాల్ మకనీ, తందూరి చికెన్, ఫ్రెంచ్ ప్రైస్, జీరా రైస్, కడాయి పనీర్, బటర్ చికెన్ లాంటి ఫుడ్స్ ఎక్కువగా ఆర్డర్ చేశారు.
అంతర్జాతీయ రుచుల్లో చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్ వంటకాలు ముందు వరసలో ఉన్నాయి. స్టాటర్స్ లో చికెన్ లాలీపాప్, వెజ్ మంచూరియా, చికెన్ 65 , తందూరి చికెన్ లాంటివి ఆర్డర్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ లో మసాలా దోశ, ఇడ్లీ, వడ, సాదా దోశ, పూరీ, పొంగల్, పోహ లాంటి వాటిని ఎక్కువగా ఆర్డర్ చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగినట్లు సర్వేలో తేలింది.