చాలా సింపుల్ గా చేయడానికి సులభంగా ఉంది. అదేవిధంగా వెరైటీగా కూడా ఉంటుంది. ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా ఈ బ్రెడ్ ఉప్మాని ఇష్టపడతారు.
ఇంటికి బంధువులు వచ్చినప్పుడో.. టిఫిన్ చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడో.. టక్కున అందరికీ గుర్తు వచ్చేది ఉప్మా. చాలా సింపిల్ గా.. తక్కువ సమయంలో చేసేయవచ్చు. అందుకే చాలా మంది దీనిని తయారుచేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు మీరు గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, సేమ్యా ఉప్మా రుచి చూసి ఉంటారు. మరి ఎప్పుడైనా బ్రెడ్ ఉప్మా రుచి చూశారా..? అసలు ఈ బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా...
బ్రెడ్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసులు - ఐదు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున పచ్చిమిర్చి - రెండు, అల్లంతరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు, సాంబార్‌పొడి - చెంచా, నెయ్యి - నాలుగు చెంచాలు, ఉప్పు - తగినంత, ఆవాలు, సెనగపప్పు - అరచెంచా చొప్పున.
తయారు చేసే విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక బ్రెడ్ ముక్కల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, సెనగపప్పూ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలూ, పసుపూ, సాంబార్ పొడీ, ఉప్పూ వేసి మంట తగ్గించాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.
చాలా సింపుల్ గా చేయడానికి సులభంగా ఉంది. అదేవిధంగా వెరైటీగా కూడా ఉంటుంది. ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా ఈ బ్రెడ్ ఉప్మాని ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి.