మహిళలు కూడా నిలబడి మూత్ర విసర్జన చేసే కిట్ ని ఐఐటీ విద్యార్థులు కనుగొన్నారు.
పురుషులకు, మహిళలకు శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. ఆ మార్పులకు తగినట్టే.. వారు అనుసరించే పద్దతులు కూడా ఉంటాయి. సాధారణంగా పురుషులు నిల్చొని, కూర్చొని మూత్ర విసర్జన చేస్తారు. కానీ.. మహిళలు కేవలం కూర్చొని మాత్రమే మూత్ర విసర్జన చేయగలరు. అయితే.. మహిళలు కూడా నిలబడి మూత్ర విసర్జన చేసే కిట్ ని ఐఐటీ విద్యార్థులు కనుగొన్నారు.
మోకాళ్ల ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు, గర్భిణీలు, దివ్యాంగులు మరియు పలు సమస్యలతో మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడి మూత్రవిసర్జన చేయవచ్చని ఆ విద్యార్థినులు చెప్పారు.
ఆ పరికరానికి ‘శాన్ఫి’ అని పేరు పెట్టారు. కేవలం పదంటే పది రూపాయల ఖరీదు ఉండే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షించారు.‘వరల్డ్ టాయిలెట్ డే’ (ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) సందర్భంగా సోమవారం రోజున దీనిని విడుదల చేశారు. భూమిలో త్వరగానే కలసిపోయే ఈ పరికరాలను లక్ష వరకూ దేశవ్యాప్తంగా పంచారు.