జాగ్రత్త.. చేపలను ఇలా వండుకుని తింటే క్యాన్సర్ వస్తుంది..

Published : Feb 13, 2022, 02:15 PM IST
జాగ్రత్త.. చేపలను ఇలా వండుకుని తింటే క్యాన్సర్ వస్తుంది..

సారాంశం

మాంసాహారాల్లో చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ ఈ చేపలను ఎయిర్ ఫ్రయ్యర్  లో వండుకుని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


కాఫీమేకర్ సైజులో ఉండే ఎయిర్ ఫ్రైయర్ లల్లో చికెన్ నగ్గెట్స్ ను, చాప్ చేసిన బంగాళదుంపలను, గుమ్మడికాయ ముక్కలను ఫ్రై చేసుకోవచ్చని మనందరికీ తెలిసిందే. కాగా ఇది కన్వెన్షన్ ఒవెన్ లాగే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ లో ఉండే ఫ్యాన్ 400 F వరకు వేడి గాలిని ఫుడ్ చుట్టూ చేరేలా చేస్తుంది.  ఈ గాలి వల్ల ఫుడ్ ఐటమ్స్ పై భాగం బాగా ఉడుకుతుంది. అందుకే అందులో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ పై భాగం క్రిస్పీగా, బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. ఇక ఫుడ్ వెలుపలి భాగం సాఫ్ట్ గా అవుతుంది.

ఎయిర్ ఫ్రైయర్ లో ఏం వండాలి:  నూనెలో చేసుకునే ఏరకమైన ఫుడ్ ఐటమ్స్ అయినా సరే వాటిని ఎంచక్కా ఎయిర్ ఫ్రైయర్ లో వండుకుని తినొచ్చు. అంటే నగ్గెట్స్, ఆనియన్ రింగ్స్, చికెన్ ఫింగర్స్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్ వంటి వాటిని ఈ ఎయిర్ ఫ్రయర్ లో చక్కగా వండుకుని తినేయొచ్చు. ఫుడ్ ఐటమ్స్ ను నూనెలో ఫ్రై చేయడం కంటే వాటిని ఎయిర్ ఫ్రై లో వండుకుని తినడం ఉత్తమమైన పని. వీటిలో వండటం వల్ల 70 నుంచి 80 శాతం కేలరీలను తగ్గించినట్టే. అంతేకాదు వీటిలో కుక్ చేసిన ఆహారంలో ఫ్యాట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ కుకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను సైతం  తరిమికొట్టవచ్చు. 

ఆలుగడ్డలు లేదా ఇతర ఆహారపదార్థాలను వండటం వల్ల అవి అక్రిలమైడ్ అనే కెమికల్ ను రిలీజ్ చేస్తాయట. ఆ కెమికల్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫుడ్ లను ఎయిర్ ఫ్రై లో వండటం వల్ల ప్రమాదకరమైన ఆక్రిలమైడ్ అనే కెమికల్ 90 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఇన్ని ఉపయోగాలున్నా ఎయిర్ ఫ్రై ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఒక రీసెర్చ్ ప్రకారం.. ఎయిర్ ఫ్రయ్యర్ లల్లో చాలపను ఫ్రై చేయడం వల్ల  Cholesterol oxidation products పెరిగిపోతాయట. దీనివల్ల ప్రమాదకరమైన క్యాన్సర్, Coronary heart disease, ఇతర అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. కానీ ఫిష్ లేదా ఇతర మాంసాహారాన్ని ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసేటప్పుడు Fresh parsley కలిపాలి. ఎందుకంటే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ మాదిరి పనిచేసి Cholesterol oxidation products ను తగ్గించడానికి సహాయపడతాయి.

ఎయిర్ ఫ్రయర్ లో చేపలను ఫ్రై చేస్తే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తగ్గిపోయే అవకాశం ఉంది. మంచి HDL కొలెస్ట్రాలన్ ను పెంచడంలో ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు ఇవి గుండెకు ఆరోగ్యానికి సహాయపడతాయి. అందుకే చేపలను ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేయకపోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. 

PREV
click me!

Recommended Stories

Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు