భర్తకి ఎఫైర్ ఉందని భార్యకి ముందే తెలిస్తే..? ఓ పాఠకురాలి అనుభవం

By ramya neerukonda  |  First Published Aug 15, 2018, 2:56 PM IST

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు: మహిళల అభద్రతాభావంతో మొదటికే మోసం


మీరు మీ తప్పులను అంగీకరించడం అంత తేలిక్కాదు. కొంతకాలం భార్యాభర్తలు వైవాహిక జీవితం గడిపిన తర్వాత తలెత్తిన విభేదాలతో విడాకులు తీసుకుంటారు. అంత వరకు బాగానే ఉంది . మహిళలు తమ వైవాహిక జీవితం వైఫల్యాలకు ఇంట్లోనే ఉండే తల్లిని ఆడిపోసుకుంటారు. వివాహం జరిగినప్పటి నుంచి విడాకులకు దారి తీసిన పరిస్థితులను ఒకసారి మననం చేసుకుంటూ తామెక్కడ తప్పు చేశారో గుర్తు చేసుకోవడానికి.. పరిస్థితులు చేయి దాటి పోయిన తర్వాత వాస్తవిక ద్రుక్పథంతో ప్రయత్నిస్తుంటారు. 

తప్పుడు కారణాలతో విడాకులు తీసుకున్నాక సరిదిద్దుకోలేని తప్పుకు పశ్చాత్తాపం పొందుతుంటారు. నెమ్మదిగా సరిదిద్దుకోవాల్సిన కాపురాన్ని చేజేతులా చెడగొట్టుకున్నామని బాధపడుతూ ఉంటారు. భార్యాభర్తలు పెండ్లియిన ప్రారంభంలో పరస్పరం తమ గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. భార్యాభర్తల మధ్య నిత్యం జరిగే సంభాషణల్లో భర్తకు గల గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకునే నవ వధువులు అప్పటికైతే హాయిగా నవ్వేస్తారు గానీ.. కానీ అసూయ, అనుమానానికి మారుపేరైన అతివల్లో ఎక్కడో ఒకచోట భర్తపై అనుమాన భూతం కెలుకుతూ ఉంటుంది. తన భర్త స్త్రీ లోలుడిగా మారతారేమోనని ఆందోళన చెందుతుంటారు. 

Latest Videos

భార్యలు తమ భర్తలు ఇతర మహిళా స్నేహితురాళ్లతో సోషల్‌గా మూవ్ అవుతుంటే అంగీకరించరు. ఆయనపై ఇతర మహిళలకు గల ఆదరణను భార్యలు తట్టుకోలేరు. గతంలో భార్యాభర్తలు తమ జీవిత భాగస్వాముల గురించి తెలుసుకునే అవకాశాల్లేవు. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఆఫీసులో ఏదైనా పార్టీ జరిగితే తన భర్త ఫేస్‌బుక్ ఖాతాలో మహిళలెవరైనా ఉన్నారా? అని వెతికి చూస్తుంటారు. దురద్రుష్టవశాత్తు మహిళల ఫొటోలు ఎక్కువగా కనిపిస్తే మనస్సులో ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే పెండ్లయిన కొత్తల్లో వారి గురించి పదేపదే చర్చ జరుగుతుంది కనుక. 

భార్యాభర్తలు కలిసి భర్త లాప్‌టాప్ కంప్యూటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు హార్డ్ డిస్క్‌లో పర్సనల్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేయడం భార్యలో చురుకుదనం పెరిగిపోతుంది. తర్వాత సమయం చిక్కినప్పుడు ఆ ఫోల్డర్‌లో గర్ల్ ఫ్రెండ్స్ ఫొటోలు ఉండటం నమ్మశక్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు తమ భర్తలను నిలదీస్తారు. 

మరికొందరు ఆయన గర్ల్ ఫ్రెండ్స్‌తో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ఫోన్‌లో మాట్లాడేందుకు, ఆన్‌లైన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తుంటారు. నాటి నుంచి భర్త ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు చెక్ చేయడంతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు మొదలై దూరం పెరిగేందుకు పునాది ఏర్పడుతుంది. సోషల్ మీడియా కార్యక్రమాలపై నిలదీస్తే భర్త ఆగ్రహానికి గురవుతారు. భర్త వెనకు తగ్గకపోతే ఊపిరాడలేదా? అన్న పరిస్థితులు ఏర్పడతాయి.

రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా ఆఫీసులో పని చేయడమేమిటని భర్తల బాసులకు ఫోన్ చేసి అతివలు తమలోని అభద్రతాభావాన్ని బయట పెట్టుకుంటారు. ఇలా అన్నింటిని నెగెటివ్‌గా ఆలోచించడంతో పరిస్థితులు తారుమారవుతాయి. అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఆఫీసులో జరిగే ఈవెంట్ లో పాల్గొనే భర్త ఫోన్ పని చేయక.. బాసుకు ఫోన్ చేసి ఈ సంగతి చెప్పడంతో మరుసటి రోజు భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. 

పరిస్థితులు దారుణంగా మారడానికి కారణాలేమిటన్న అర్థం చేసుకోలేక మహిళలు అభద్రతాభావానికి గురవుతారు. భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని బాధపడతారు. అదేపనిగా భార్యాభర్తలు పరస్పరం దూషించుకుంటూ ఉంటారు. అతివలు తమ పరిస్థితులు అర్థం చేసుకోకుండా తన భర్త క్రమంగా తనకు దూరమవుతున్నారని ఆందోళన చెందుతుంటారు. 

భర్త ఊళ్లో లేనప్పుడు భర్త మాజీ స్నేహితురాళ్లతో సంబంధ బాంధవ్యాలు నెరపడానికి భార్యలు ప్రయత్నిస్తారు. ఆఫీసు పనిపై వెళ్లినప్పుడు ఇతర నగరాల్లో సెటిలైన స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతారని సందేహిస్తారు. వెనుకాముందు ఆలోచించకుండా సదరు బాల్య స్నేహితురాళ్లను ప్రశ్నిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో కథ పరాకాష్టకు చేరుకుంటుంది. భర్త ఇంటికొచ్చాక భార్యతో మాట్లాడటం మానేస్తారు. కొన్ని రోజులకు సొంతూళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు విషయాలన్నీ చెప్పిన తర్వాత విడాకులివ్వమని కోరుతారు.  

తన వెనుకేం జరిగిందో. ఆమె ఏం చేసిందో తనకు తెలుసునని ఎదురు దాడికి దిగుతాడు. దీనిపై ఇరువురి మధ్య భారీ మాటల యుద్ధం సాగుతుంది. ఏడాది తర్వాత పరస్పర అంగీకారం మేరకు విడాకులు కావాలని కోరతారు. విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు వెనుదిరిగి చూసుకుంటారు అతివలు. చిన్న పొరపాట్లకు తమ జీవితాన్నే ఫణంగా పెట్టాల్సి వచ్చిందని చింతిస్తూ ఉంటారు. తన భాగస్వామితో కలుపుగోలుగా వ్యవహరించి ఉంటే మెరుగ్గా ఉండేదని భావిస్తారు. 

click me!