స్వచ్ఛమైన బంగారంతో స్వీట్లు.. కేజీ రూ.9వేలు

By ramya neerukonda  |  First Published Sep 12, 2018, 1:20 PM IST

మామూలుగా ఐతే  సిల్వర్ పూత కలిగిన స్వీట్లను విక్రయిస్తుంటారు కదా. అయితే  సిల్వర్ కు బదులు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పూత పూసి అమ్ముతున్నారు ఆ స్వీటు షాపు వాళ్లు.


పండగ వచ్చిందంటే చాలు.. అందరి ఇళ్లల్లో ముందుగా ప్రత్యక్షమయ్యేది స్వీట్లే.  ఏ పండగైనా స్వీట్లు చేసుకోవడం.. ఒకరికి మరొకరికి తినిపించుకోవడం మనకు ఆనవాయితీ. అయితే.. ఈసారి మాములు స్వీట్లు కాకుండా మీ ప్రియమైన వ్యక్తులకు బంగారు స్వీట్లు తినిపించండి. అలాంటి ఇలాంటి బంగారం కాదు స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారంతో చేసినవి.

ఈ బంగారం స్వీట్ల పూర్తి వివరాలు తెలుసుకుందామా...సూరత్ లోని ‘24 క్యారెట్స్ మిఠాయి మ్యాజిక్’ అనే స్వీట్ షాపులో పండగల సందర్భంగా  ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.  మామూలుగా ఐతే  సిల్వర్ పూత కలిగిన స్వీట్లను విక్రయిస్తుంటారు కదా. అయితే  సిల్వర్ కు బదులు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పూత పూసి అమ్ముతున్నారు ఆ స్వీటు షాపు వాళ్లు.

Latest Videos

కిలో ఎంత అనుకుంటున్నారు. కేవలం 9000 వేల రూపాయలే. ఏమిటి కిలో స్వీట్లు 9000 వేలా అని నోరెళ్లబెడుతున్నారా. బంగారం స్వీట్లు కాబట్టి అంత ధర పెట్టాల్సిందే మరి. బంగారం తింటే ఏం కాదా? ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదా అంటే...అలాంటిదేమి ఉండదట. బంగారం ఒంట్లోకి వెళితే ఏం అవుతుందన్న దానిపై మేం చాలా రీసర్చ్ చేశాం. ఈ రీసెర్చ్‌లో మాకు తెలిసిందేంటంటే.. బంగారం మన శరీరంలోకి వెళితే మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ లను నయం చేసే శక్తి బంగారానికి ఉందని, డాక్టర్లు కూడా చాలా ట్రీట్ మెంట్లలో బంగారాన్ని ఉపయోగిస్తారని చెబుతున్నారు షాపు యజమానులు.  మనం అంటుంటాం కదా..రాగి బిందెలో నీళ్లు తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని, అలాగే ఈ బంగారు పూతతో కూడా మన శరీరానికి మేలు జరుగుతుందట.

అయినా సరే అంత ధర పెట్టి ఎవరు కొంటారు అని అనుకోకండి. ఆ బంగారు స్వీట్లకోసం చాలామంది ఎగబడుతున్నారాట. ఈ స్వీట్లవల్ల మాషాపు చాలా ఫేమస్ అయ్యిందని చెబుతున్నాడు ఆ షాపు యజమాని. 
 

click me!