రోజూ ఓ యాపిల్... ఆ సమస్య రాదట

By telugu teamFirst Published Sep 6, 2019, 3:19 PM IST
Highlights

 తాజాగా ఓ పరిశోధనలో యాపిల్ వల్ల కలిగే ఓ ప్రయోజనాన్ని కనుగొన్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

రోజూ ఒక యాపిల్ తింటే... డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదంటూ ఓ ఇంగ్లీష్ సామేత ఉంది. దానర్థం... యాపిల్ లో ఉండే పోషక పదార్థాలను.. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయని అర్థం. కాగా... తాజాగా ఓ పరిశోధనలో యాపిల్ వల్ల కలిగే ఓ ప్రయోజనాన్ని కనుగొన్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

కాగా... యాపిల్ పండ్ల వల్ల న్యుమోనియా వ్యాధి రాకుండా చూసుకోవచ్చని పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయన వివరాలను తాజాగా ప్రచురించారు. వాటి ప్రకారం... యాపిల్ పండ్లను తినడం వల్ల న్యుమోనియా రాకుండా ఉంటుందని తేలింది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని సైంటిస్టులు తేల్చారు. నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని వారంటున్నారు.

click me!