మరో వ్యక్తి పట్ల ఆకర్షణ ఎందుకు మొదలవుతుందనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిల్లో ఈ అంశాలు కొంతవరకూ కారణమవుతాయి. స్త్రీ, పురుషులు ఎవరైనా కావచ్చు... కొందరు తమ భాగస్వామిని ఇతరులతో పోల్చుకుంటారు. అందం, ఆహార్యం, అలవాట్లు, మాటతీరు, ఉద్యోగం, ప్రేమను వ్యక్తం చేసే తీరు వరకూ ఎన్నో ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో ఆ ప్రత్యేకతలు ఏ కాస్త కనిపించినా చాలు అది ఆకర్షణకు దారితీస్తుంది.
స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజం. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఆ ఆకర్షణ పెళ్లికాకముందు మొదలైతే దానిని ప్రేమ అంటారు. కానీ... పెళ్లి తర్వాత భాగస్వామిని కాదని మరోకరిపై మొదలైతే మాత్రం దానికి అక్రమ సంబంధం అని అనాల్సిందే. గత సంవత్సరకాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అక్రమ సంబధాలకు సంబంధించిన సంఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి.
కొందరు స్త్రీలు అయితే ఏకంగా... ఈ అక్రమ సంబంధం మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కూడా కడతేర్చారు. అయితే... ఈ ఘటనలు చోటుచేసుకోవడానికి గల అసలు కారణాలేంటో నిపుణులు వివరిస్తున్నారు. జీవన విధానం, స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం, సామాజికీకరణ... ఇలా కారణాలు ఏవైనా తరచూ ఇలాంటి సంఘటనలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఆ ఆకర్షణ సంఘర్షణలో పడి కాపురాలనూ కల్లోలంగా చేసుకునేవారూ లేకపోలేదు. అలా కాకుండా ఉండాలంటే తట్టుకుని నిలబడటం తెలిసుండాలి.
మరో వ్యక్తి పట్ల ఆకర్షణ ఎందుకు మొదలవుతుందనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిల్లో ఈ అంశాలు కొంతవరకూ కారణమవుతాయి. స్త్రీ, పురుషులు ఎవరైనా కావచ్చు... కొందరు తమ భాగస్వామిని ఇతరులతో పోల్చుకుంటారు. అందం, ఆహార్యం, అలవాట్లు, మాటతీరు, ఉద్యోగం, ప్రేమను వ్యక్తం చేసే తీరు వరకూ ఎన్నో ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో ఆ ప్రత్యేకతలు ఏ కాస్త కనిపించినా చాలు అది ఆకర్షణకు దారితీస్తుంది.
కొందరు పెళ్లైన కొత్తల్లోనే అందం, ఆహార్యం, ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. రోజులు గడిచేకొద్దీ పట్టించుకోరు. అందం తగ్గిందనో, సౌందర్య పోషణ లేదనో, లావయ్యారనో... ఆ కొందరు భాగస్వామిని అశ్రద్ధ చేయొచ్చు. మరికొందరు పేరుకే భార్యాభర్తలు. తరచూ ఒకరినొకరు అవమానపరచుకుంటూ ఉంటారు. నలుగురిలోకి వచ్చినా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఒకరికొకరు అసలు విలువ ఇవ్వరు. అవన్నీ అందించే వ్యక్తి దొరికినప్పుడు ఆ ఆకర్షణకు లొంగే అవకాశం ఎక్కువ.
అసంతృప్తి కూడా పర ఆకర్షణకు ఓ కారణమే. ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం, పిల్లలతో గడపకపోవడం, సరదాగా బయటకు తీసుకెళ్లకపోవడం, విందులకీ, వినోదాలకీ దూరంగా ఉండటం... ఇలాంటివన్నీ అందుకు దారితీసే అంశాలే. జీవితభాగస్వామి ఇలా ఉండాలి, అలా మాట్లాడాలనే ఆలోచనలు మామూలే. అవేవీ జరగనప్పుడు తను ఇంతే అనే అసంతృప్తితో పొరపాట్లు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు.
పెళ్లైన కొత్తల్లో ఉన్నంత పరవశం ఏళ్లు గడిచేకొద్దీ ఉండకపోవచ్చు. బాధ్యతలు పెరగడం, రకరకాల ఒత్తిళు, కలయికకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం... ఇలాంటి ఆకర్షణ వలలో పడేందుకు దారితీస్తాయి.