Health: ఆరోగ్యం కోసం వర్కౌట్లే కాదు.. మంచి ఆహారమూ అవసరమే.. అవేంటో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Jan 12, 2022, 12:10 PM IST
Highlights

Health: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం సంరక్షణలో అత్యంత కీలకమైన అంశం ఆహారం. చాలా మంది ఫిట్ గా ఉండటానికి నిత్యం వర్కౌట్లు చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకుకోవాలి. ఫిట్ నెస్ కోసం కష్టించే వారు ఖచ్చితంగా సత్వర ఎనర్జీనిచ్చే హెల్దీ స్నాక్స్ ఎంతో అవసరం.
 

Health: మన ఆరోగ్యమే చెబుతుంది మనమెలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది. అవును మరి హెల్తీగా ఉంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటున్నామని అర్థం చేసుకోవచ్చు. అదే తరచుగా అనేక రోగాల బారిన పడితే మాత్రం సరైన ఫుడ్ తీసుకోవడం లేదని అర్థం. ఫుడ్ విషయంలో మనమెంత Caring తీసుకుంటే మనమంత హుషారుగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఫుడ్ తో పాటుగా శారీరక శ్రమ కూడా మనల్ని ఆరోగ్యవంతంగా తయారుచేస్తుంది. అందులోనూ చాలా మంది ఫిట్ గా కనిపించాలని కోరుకుంటుంటారు. అందుకోసం రకరకాల వర్కౌట్లు చేస్తారు. ఇలా చేసే వారు ఎనర్జీనిచ్చే ఫుడ్ కే ఎక్కువ Preference ఇవ్వాలి. ఫిట్ నెస్ కోసం కష్టించే వారు ఖచ్చితంగా సత్వర ఎనర్జీనిచ్చే హెల్దీ స్నాక్స్ ఎంతో అవసరం. వాటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందడంతో పాటుగా మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల కండరాల అలసట కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గుడ్లు: హెల్తీ స్నాక్స్ గా ఉడకబెట్టిన గుడ్డు పేరుపొందింది. దీనితో ఐరన్, కొలిన్, విటమిన్ ఎ, బి 12 లు, ఫోలేట్ లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే దీన్ని తింటే మనకు కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. సో ఉడకబెట్టిన గుడ్లు తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

అరటిపండు:  అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల సత్వర శక్తి లభిస్తుంది. అలాగే వీటిలో పొటాషియం కూడా మెండుగా ఉంటుంది. దీని వల్ల కండరాల నొప్పి, అలసట తగ్గుతాయి. ఈ పండును మీరు ఎక్సర్ సైజ్ చేసే ఒక అరగంట ముందు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చిలకడదుంపలు:  శరీరంలో ఎనర్జీని అమాంతం పెంచడంలో ఈ చిలకడదుంపలు ముందుంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి లు మెండుగా లభిస్తాయి. ఈ విటమిన్లు యాంజీ ఆక్సిడెంట్ గా మారి శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎక్సర్ సైజ్ చేసే ముందు తినాల్సిన ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది ఇదేనని చెప్పాలి. కాగా ఈ చిలకడదుంపలు ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని కూడా తగ్గిస్తుందట.

ఓట్ మీల్ పారిడ్జ్:  ఓట్స్ లో బీటా గ్లూకాన్, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటిని మనం తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ రిలీజ్ అయ్యి మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి. ఈ ఓట్స్ ను పాలు లేదా నీళ్లలో కలిపి తీసుకోవచ్చు. అలాగే  కస్మిస్, నట్స్, ప్రొటీన్ పౌడర్ తో కలిపి తీసుకుంటే శరీరానికి మరిన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండగలుగుతాం. 

ఫ్రూట్ స్మూతీలు:  టేస్టీగా, యమ్మీ యమ్మీ గా ఉండే ఫ్రూట్ స్మూతీల వల్ల మనకు చాలా పోషకాలు అందుతాయి. పెరుగులో రకరకాల పండ్ల ముక్కలను వేసి తినడం వల్ల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మెండుగా లభిస్తాయి. 

పీనట్ బటర్:  వ‌ర్కౌట్లు చేసేవారికి తక్షణ శక్తిని ఇచ్చేందుకు ఈ పీనట్ బటర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్సర్ సైజ్ చేసే ఒక అరగంట ముందు తింటే మంచి ఫలితం ఉంటుంది. 


 

click me!