స్పెర్మ్ కౌంట్ పై ఎండాకాలం దెబ్బ..?

By ramya NFirst Published Mar 20, 2019, 4:24 PM IST
Highlights

మద్యం, పొగ లాంటివి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మద్యం, పొగ లాంటివి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. అంతేకాదు.. కొన్ని రకాల హ్యాబిట్స్ కూడా వీర్య కణాల సంఖ్య తగ్గడానికి కారణమౌతాయి. అయితే.. ఇవి కాకుండా వేసవి కాలం కూడా పురుషుల వీర్యకణాలపై దెబ్బ కొడుతోందట.

వేసవిలో వాతావరణంలో పెరిగే వేడి ప్రభావం వీర్యం మీద ఉంటుంది. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో ఎంతోకొంత స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం సహజమే! ఇంటిపట్టున లేదా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే వారి కంటే పగలంతా ఎక్కువగా ఎండకు గురయ్యేవారికి వీర్యకణాలు తగ్గుతాయు. 

ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ, పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువగా ఎండకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే రాత్రివేళ లోదుస్తులు ధరించడం మానేస్తే మంచిది. బిగుతైన జీన్స్‌ లాంటి దుస్తులు వేసుకోవడం తగ్గించి, గాలి చొరబడే వీలుండే పల్చని దుస్తులు వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 

click me!
Last Updated Mar 20, 2019, 4:24 PM IST
click me!