బెడ్రూమ్ స్పెషల్.. కామసూత్ర పుస్తకాన్ని విడుదల చేసిన ఐకియా

By ramya N  |  First Published Mar 18, 2019, 4:22 PM IST

ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ ఐకియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్వీడన్ కి చెందిన ఓ ఐకియా సంస్థ హైదరాబాద్ లో కూడా ఇటీవల ప్రారంభించారు. 


ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ ఐకియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్వీడన్ కి చెందిన ఓ ఐకియా సంస్థ హైదరాబాద్ లో కూడా ఇటీవల ప్రారంభించారు. ఈ ఐకియా కంపెనీ కామసూత్ర పుస్తకాన్ని విడుదల చేసింది.

శృంగారం గురించి తెలియాలంటే.. వాత్సాయుని కామసూత్ర పుస్తకం చదవాలి అంటుంటారు పెద్దలు. ఇప్పుడు అలాంటి పుస్తకాన్ని ఐకియా విడుదల చేయడం విశేషం. కాకపోతే.. సెక్స్ గురిచి కాకుండా... బెడ్ రూమ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దానిని ఈ బుక్ లో ఫోటోలతో  సహా ప్రింట్ చేయడం గమనార్హం.

Latest Videos

బెడ్‌రూమ్‌ను స్వర్గంగా ఎలా మార్చుకోవాలో తెలుపుతూ అందమైన చిత్రాలతో 44 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చిన ఈ పుస్తకాన్ని చూస్తే తప్పకుండా మీ కళ్లు బైర్లు కమ్ముతాయి.  సెక్స్ లో వివిధ భంగిమలు ఉన్నట్లే.. ఈ పుస్తకంలో ఆయా రకాల భంగిమల పేరితో బెడ్ రూమ్ డిజైన్స్ ఉన్నాయి. 

ఈ పుస్తకంలో కామసూత్రలో ఉండే ప్రతి భంగిమ పేరును ఐకియా వాడేసుకుంది. ఉదాహరణకు డాగీ స్టైల్ అనే భంగిమ గురించి చెబుతూ బెడ్రూమ్‌ను పెంపుడు కుక్కలకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో సూచించింది. ఇలా మరికొన్ని భంగిమలను కూడా బెడ్రూమ్‌ల అలంకరణకు అన్వయిస్తూ ఈ ప్రయోగం చేసింది..

కాగా.. ఈ ఐకియా కామసూత్ర పుస్తకానికి కష్టమర్స్ దగ్గర నుంచి స్పందన బాగా వస్తోందట. 

click me!