హస్త ప్రయోగం.. రోజుకి ఎన్నిసార్లు..?

By ramya N  |  First Published Feb 19, 2019, 2:10 PM IST

అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. 


అనేక మంది యువతీ యువకులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. ఇలాంటి వారిలో కొంతమంది రోజుకు ఐదారుసార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. అయితే.. హస్త ప్రయోగం ఎక్కువగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు.

ముఖ్యంగా..  కీళ్ల నొప్పులు రావడం, కళ్లకింద నల్లటి మచ్చలు ఏర్పడటం, శరీరమంతా నీరసంగా ఉండటం లాంటివి దీని వల్లే జరుగుతున్నాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే..  అదంతా వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.

Latest Videos

undefined

హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు. 

సెక్స్‌ భాగస్వామి లేనప్పుడు, సెక్స్‌లో పాల్గొనే అవకాశం కన్పించనప్పుడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా స్వయంతృప్తి పొందవచ్చని వారు చెబుతున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనదని.. ఎలాంటి  అనారోగ్య సమస్యలకు దారి తీయదని చెప్పారు.  హస్తప్రయోగ సమయంలో చేతిలో అంగం ఎలా కదులుతుందో అదే కదలిక సెక్స్‌ సమయంలో యోనిలో జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి అతిగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల  అంగం బలహీనపడుతుందనడంలో నిజం లేదన్నారు. 

నిజానికి ఏ శరీర భాగమైనా సరిగా వాడకపోతే బలహీనపడుతాయి. కళ్ళ కింది నల్ల చారలు, కీళ్ళనొప్పులకు హస్తప్రయోగానికి సంబంధం లేదు. హస్త ప్రయోగం వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. దీని వల్ల ఒత్తిడి పోతుందని అక్రమ సంబంధాలకు పోయి రోగాలు తెచ్చుకోవడం జరగదని వైద్యులు చెపుతున్నారు. 
 

click me!