Food Facts: మనదేశ ఆహారం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..

By Mahesh RajamoniFirst Published Aug 7, 2022, 11:18 AM IST
Highlights

Food Facts: ఒక్కో దేశంలో ఒక్కో రకం వంటకాలు స్పెషల్ గా ఉంటాయి. ఒక దేశంలో లభించే  కొన్ని వంటకాలు వేరే దేశాల్లో లభించవు. అయితే భారత దేశ వంటకాల గురించి కొన్ని నిజాలు మనలో చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

  • భారతీయ వంటకాలను టేస్ట్ చేయని వారికి.. ప్రతి వంటకం కారంగానే ఉంటుందని అనుకుంటారు. నిజానికి.. అన్ని రకాల వంటలు కారంగానే ఉండవు. ఎందుకంటే దక్షిణ భారత వంటకాల కంటే ఉత్తర భారత వంటకాలు తక్కువ కారంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో పాల ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తారు. 
  • 200 కంటే ఎక్కువగానే భారతీయ స్వీట్లు, డిజర్ట్లు ఉన్నాయి. కానీ చాలా రెస్టారెంట్లు గులాబ్ జమూన్, ఖీర్ లనే ఎక్కువగా తయారుచేస్తాయి. 
  • చాలా మంది అనుకున్నట్టు భారతదేశంలోని ప్రజలందరూ శాకాహారులైతే కాదు. వీరు మాంసాన్ని తక్కువ మొత్తంలో తింటారంతే.. దేశ జనాభాలో కేవలం 29 శాతం మంది మాత్రమే శాకాహారాన్ని తింటున్నారన్న ముచ్చట మీకు తెలుసా.. మన దేశంలో కోడి, మేక, గొర్రె మాంసాలు చాలా ఫేమస్. 
  • చాయ్, మసాలా టీ  వంటి పానీయాలు 5 వేల సంవత్సరాల కిందట ఒక పురాతన రాజ ఆస్థానానికి చెంది ఒక వైద్య పానీయంగా భావించబడింది. కాఫీని బ్రిటీష్ వారే ఇండియాకు పరిచయం చేశారు. 
  • ప్రపంచంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో 70 శాతానికి పైగా భారతదేశమే ఉత్పత్తి చేస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే.. మన దేశమే ఎక్కువ రకాల మసాలా దినుసులకు ఉత్పత్తి చేస్తుంది. అందులో నల్ల మిరియాలు 2,000 B.C.E.చెందినవి. వీటిని నల్ల బంగారం అని కూడా పిలిచేవారు. 
  • గర్బిణులు ఎక్కువగా తీసుకునే కుంకుమ పువ్వు మన దేశానికి చెందినది కాదు. దీన్ని గ్రీకు లేదా రోమన్ వర్తకులు భారతదేశానికి తీసుకువచ్చారట.
  • సమోసా కూడా 13వ, 14వ శతాబ్దాల ముందు మధ్యప్రాచ్యంలో భారతదేశంలోకి వచ్చినప్పుడు సంబోసా అనే పేరుతో పిలవబడేది. 
  • లేబీని మధ్యప్రాచ్యంలో తయారుచేశారు. దీనిని జబియా (అరటిక్) లేదా జాలిబియా (పర్శియన్) అని పిలిచేవారు.
  • ప్రపంచంలో హాటెస్ట్ మిరపకాయల్లో ఒకటైన భోట్ జోలోకియాకు భారతదేశం నిలయం. దీనిని ‘ఘోస్ట్ చిల్లీ’ అని కూడా పిలిచేవారు. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో పండేది. 
click me!