
ప్రస్తుతం రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ మహిళల పట్ల పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వివక్షత చూపెడుతున్నారు. ఒకవైపు టెక్నాలజీ పరుగులు పెడుతుంటే మహిళలు కూడా కాలంతో పాటు పరుగులు పెడుతూ అన్ని రంగాలలో స్థిరపడి పురుషులకు మేము కూడా పోటీ అని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళుతుండగా కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికి మహిళల పట్ల చిన్నచూపు వివక్షత ఉంది. ఇప్పటికీ కొందరు మహిళలు కేవలం వంటింటి కుందేలుగానే ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే టెక్నాలజీ అభివృద్ధి చెందడం అలాగే ప్రతి ఒక్కరి అవసరాలు కూడా పెరగడంతో మహిళలు కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి.
కానీ గత కొన్ని దశాబ్దాల క్రితం మహిళలు ఇంటి గడప దాటి బయటకు వచ్చే వాళ్ళు కాదు. మహిళలకు ఎలాంటి చదువు లేదు. లోకం గురించి ఎలాంటి పరిజ్ఞానం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే ఏకంగా లా చదివి మన దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యాయవాదిగా పేరు సంపాదించిన మహిళ గురించి చాలామందికి తెలియదు. అప్పట్లోనే ఈమె పురుషులతో పోటీగా కోర్టులో తన వాదనను వినిపించారు. మరి భారత దేశంలో నల్ల గౌను ధరించిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే...
భారతదేశంలో మొట్టమొదటి న్యాయవాది అయిన మహిళ పేరు కర్నేలియా సోరబ్జి. ఈమె సోరబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మొట్టమొదటి మహిళగా న్యాయవాది విద్యను అభ్యసించిన మహిళగా అలాగే భారత దేశంలో మొదటిసారి నల్ల కోటు ధరించి తన వాదన వినిపించిన మహిళగా కర్నేలియా సోరబ్జి పేరు సంపాదించుకున్నారు. ఇలా మొట్టమొదటి భారతీయ న్యాయవాదిగా పేరు సంపాదించుకున్న ఈమె ప్రతిమను 2012 వ సంవత్సరంలో లింకన్ ఇంగ్లాండ్ లో ఆవిష్కరించారు. ఇలా మొదటి న్యాయవాదిగా ఈమె ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు.