జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ చీరల గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

Published : Aug 06, 2022, 12:13 PM ISTUpdated : Aug 06, 2022, 02:15 PM IST
జీఐ గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ చీరల గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

సారాంశం

ఇక్కత్ అని పిలువబడే పోచంపల్లి చీరలకు ఉన్న డిమాండ్ మరే చీరలకు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా.. ఈ కళకు జియోగ్రాఫికల్ ఇండియేషన్ గుర్తింపు దక్కింది. ఈ సందర్బంగా ఈ పోచంపల్లి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి.. 

తెలంగాణ రాష్ట్రం.. నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది. ఒకప్పుడు ఇక్కడ గాజులు స్పెషల్ గా నిలిస్తే.. ఇప్పుడు ఇక్కత్ చీరలు మంచి గుర్తింపును పొందాయి. మగువలు మచ్చే అందమైన ఇక్కత్ చీరలు ఇక్కడే పుట్టాయి మరి. ఈ చీరలు ఇక్కత్ ప్రింట్ల ద్వారా గుర్తించబడ్డాయి. ఇక్కత్ అంటే చీరలకు రంగులు వేసే సంప్రదాయ పద్దతి. ఈ పద్దతిలో చీరకు ఎక్కడ రంగు వేయాలో ఊహించుకుని అక్కడే వేస్తారు. ఈ పద్దతినే రెసిస్ట్ డైయింగ్ అంటారు. దీనిలో ఫ్యాబ్రిక్ అంతటా డై వ్యాపించకుండా ఉంటుంది. అంటే దారాలకే రంగులేసి.. డిజైన్లను వేస్తారు. 

రెసిస్టు డైయింగ్ అనేది ప్రపంచంలోని పురాతన పద్దతుల్లో ఒకటి. ఈ శైలిని ఉపయోగించే పురాతన ఫాబ్రిక్ నమూనాలలో ఒకటి ఈజిప్టుకు చెందింది. మమ్మీలను వెలికితీసే సమయంలో నార పట్టీలను చరిత్ర కారులు కనుగొన్నారు. అయితే ఆసియాలో, చైనా ఈ పద్దతిని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఎందుకంటే ఇది టాంగ్ రాజవంశంలో ఎక్కువగా ఉపయోగించారు. అప్పుడే పట్టు మార్గం ద్వారా ఈ టెక్నిక్ ను భారతదేశానికి పరిచయం చేశారు. పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రధానంగా 1800 కాలంలో ప్రాచుర్యం పొందాయి. 

పోచంపల్లి చీరలను తయారు చేసే హస్తకళాకారులు ఆంధ్రప్రదేశ్ లోని 80 గ్రామాల ప్రజలు పోచంపల్లిలో నివసిస్తున్నారు. ఈ గ్రామంలో నివసిస్తున్న చాలా కుటుంబాలు సంప్రదాయ మగ్గాలను కలిగి ఉన్నారు. వాటి నిర్మాణ నమూనాలు ఇప్పటి కావు.. శతాబ్దాల కిందటి నుంచి ఉన్నాయి. 

ఈ నేత ప్రక్రియలో పాల్గొనే 10,000 లకు పైగా కుటుంబాలతో ఈ ప్రాంతం ఇప్పుడు సిల్క్ సిటీగా పిలువబడుతోంది. ఈ వ్యాపారానికి సంబంధించిన టెక్నిక్స్ ఒక తరం నుంచి మరొక తరానికి అందించబడుతున్నాయి. 

పోచంపల్లి ఇక్కత్ తయారీ
 
చేతితో నేసిన బట్టలు ప్రత్యేకమైన రీతిలో అల్లుతారు. వీటిని అన్నింటికంటే వేరుగా ఎందుకు చూస్తారంటే.. వార్ఫ్స్, వెఫ్ట్ థ్రెడ్లకు మొదటగా రంగు వేస్తారు. ఆ తర్వాత బట్టలను తయారుచేయడానికి మగ్గాన్ని ఉపయోగిస్తారు. భారత దేశంలో Batik, wax సహాయంతో ఇకాట్ ను నిర్వహిస్తారు. 

బాటిక్ అనేది ఒక సంప్రదాయ టెక్నిక్. దీనిలో క్యాంటింగ్ అని పిలిచే sharp tool తో చీరలపై చుక్కలు లేదా రేఖలను వేస్తారు. క్యాప్ అని పిలువబడే కాపర్ స్టాంప్ సాయంతో రెసిస్టెంట్ ప్రింట్ ను వేస్తారు.  

పోచంపల్లి ఇక్కత్ ను చీరలను తయారుచేయడానికే కాదు సల్వార్లు, స్కర్టులు, అనార్కలీలు, లెహంగాలు వంటి వివిధ భారతీయ వస్త్రాలను కూడా తయారుచేయడానికి ఉపయోగిస్తారు. 

2005 లో పోచంపల్లికి జియోగ్రాఫికల్ ఇండికేటర్ లభించింది. ఇది చీరల ప్రామాణికతను నిర్ధారించడంలో సహాయపడుతుంది. అలాగే చీరను నేసిన చేతివృత్తుల వారి మేధో సంపత్తి హక్కులు కూడా ఉన్నాయి.

పోచంపల్లి చీరలు ఇప్పుడు .. పోచంపల్లి హ్యాండ్లూమ్ టై అండ్ డై సిల్క్ చీరల మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్,  పోచంపల్లి హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్  రిజిస్టర్డ్ ప్రాపర్టీ.

ఈ పోచంపల్లి చీరలను ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తన పెళ్లి రోజున, రిసెప్షన్ లో కట్టుకున్నారు. అంతేకాదు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ చీరలను ధరించారు. ఈ పోచంపల్లి చీరలను ఒకప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ కూడా ధరించారు.  

PREV
click me!

Recommended Stories

రాత్రిపూట అస్సలు తినకూడని పండ్లు ఇవే!
ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గడం ఈజీ